న్యూ స్మార్ట్‌ ఫోన్లలో నో ‘గూగుల్‌ ఫొటోస్‌’!

ABN , First Publish Date - 2021-03-20T05:39:43+05:30 IST

స్మార్ట్‌ ఫోన్లలో ఇకపై హై క్వాలిటీతో ఉచితంగా ఫొటోలు, వీడియోల బ్యాక్‌పనకు బ్రేక్‌ పడనుంది. భవిష్యత్తులో రిలీజ్‌ అయ్యే స్మార్ట్‌ ఫోన్లకు ఇది వర్తిస్తుంది

న్యూ స్మార్ట్‌ ఫోన్లలో నో ‘గూగుల్‌ ఫొటోస్‌’!

స్మార్ట్‌ ఫోన్లలో ఇకపై హై క్వాలిటీతో ఉచితంగా ఫొటోలు, వీడియోల బ్యాక్‌పనకు బ్రేక్‌ పడనుంది. భవిష్యత్తులో రిలీజ్‌ అయ్యే స్మార్ట్‌ ఫోన్లకు ఇది వర్తిస్తుంది.  పిక్సల్‌ 2, 3, 4, 5 ఓనర్లకు మాత్రమే ఈ సదుపాయం ఇకపై ఉంటుందని గూగుల్‌ ఫొటోస్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ ఒక ట్వీట్‌లో వెల్లడించారు.  ఒక్కసారి వెనక్కు వెళితే గత ఏడాది నవంబర్‌లోనే ఫోటోలు, ఫైల్స్‌ తదితరాలకు 15 జీబీకి మించి ఉచిత స్టోరేజ్‌ సదుపాయం కల్పించబోమని గూగుల్‌ ప్రకటించింది. పరిమితికి మించితే తగు రుసుము చెల్లించి స్టోరేజీ సదుపాయాన్ని పొందాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. అలాగే పిక్సల్‌  స్మార్ట్‌ ఫోన్లలో హైక్వాలిటీ ఫోటోలను షేర్‌ చేసుకునేందుకు సదుపాయాన్ని కూడా గూగుల్‌ ఇటీవలే పరిచయం చేసింది.

Updated Date - 2021-03-20T05:39:43+05:30 IST