Dharam Sansadలో ద్వేషపూరిత ప్రసంగం చేయలేదు...సుప్రీంకోర్టుకు ఢిల్లీ పోలీసుల అఫిడవిట్

ABN , First Publish Date - 2022-04-14T15:55:47+05:30 IST

ధరమ్ సంసద్ ద్వేషపూరిత ప్రసంగాలపై ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు సంచలన అఫిడవిట్ దాఖలు చేశారు...

Dharam Sansadలో ద్వేషపూరిత ప్రసంగం చేయలేదు...సుప్రీంకోర్టుకు ఢిల్లీ పోలీసుల అఫిడవిట్

న్యూఢిల్లీ: ధరమ్ సంసద్ ద్వేషపూరిత ప్రసంగాలపై ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు సంచలన అఫిడవిట్ దాఖలు చేశారు. ఢిల్లీ ధరమ్ సంసద్‌లో వక్తలు ద్వేషపూరిత ప్రసంగం చేయలేదని పోలీసులు సుప్రీంకోర్టుకు చెప్పారు. గతేడాది డిసెంబరు నెలలో ఢిల్లీలో జరిగిన ధర్మసంసద్‌లో ముస్లింలపై ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయ లేదని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.ఢిల్లీ, హరిద్వార్‌లలో ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన రెండు కేసులను ఢిల్లీ పోలీసులు మూసివేశారు.  2021వ సంవత్సరం డిసెంబర్ 19వతేదీన ఢిల్లీలో జరిగిన ధరమ్ సన్సద్ సందర్భంగా వక్తలు ఎలాంటి ద్వేషపూరిత ప్రసంగం చేయలేదని, ముస్లింలను రెచ్చగొట్ట లేదని సౌత్ ఈస్ట్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇషా పాండే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ల  పేర్కొన్నారు.


తమ విచారణలో మతాలకు సంబంధించిన ప్రత్యేకతలు చర్చించారని, అయితే ఏ సమాజానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేయలేదని పోలీసులు గుర్తించారు.ఆగ్నేయ ఢిల్లీ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఇషా పాండే తన అఫిడవిట్‌లో ఇద్దరు వ్యక్తులు ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఫిర్యాదు చేశారని తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో గోవింద్‌పురి మెట్రో స్టేషన్‌ సమీపంలోని బనార్సీదాస్‌ చండీవాలా ఆడిటోరియంలో హిందూ యువవాహిని నిర్వహించిన ఊరేగింపులో విద్వేషపూరిత ప్రసంగాల ద్వారా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టారని తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.ఢిల్లీ సంఘటన వీడియో క్లిప్‌లో ఎక్కడా ఏ ప్రత్యేక వర్గానికి వ్యతిరేకంగా ప్రకటన లేదని కనుగొన్నారు.ఢిల్లీ పోలీసులు అన్ని ఫిర్యాదుల దర్యాప్తును పూర్తి చేసి, అవి నిరాధారమైనవిగా గుర్తించి తదుపరి చర్యలను నిలిపివేశారు.




Updated Date - 2022-04-14T15:55:47+05:30 IST