Advertisement

మెగాస్టార్‌కు హీరోయిన్ లేదా?

Nov 26 2020 @ 11:11AM

మోహన్ లాల్ నటించిన మలయాళ సినిమా `లూసిఫర్` మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చింది. ఈ సినిమా కథ తనకు సరిపోతుందని, తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. అయితే ఈ సినిమాను ఎవరి చేతిలో పెట్టాలనే విషయంలో క్లారిటీ రావడం లేదు. `సాహో` డైరెక్టర్ సుజిత్, బాబి, వీవీ వినాయక్, హరీష్ శంకర్ పేర్లు వినిపించాయి. 


తాజాగా తమిళ దర్శకుడు మోహన్‌ రాజా పేరు తెర మీదకు వచ్చింది. మలయాళ సినిమాలో మోహన్ లాల్‌కు హీరోయిన్ ఉండదు. తెలుగు రీమేక్‌లో చిరంజీవి ఇమేజ్‌కు అనుగుణంగా పలు మార్పులు చేశారని, హీరోయిన్‌ పాత్ర ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తెలుగులో కూడా హీరోయిన్‌ లేకుండానే సినిమాను తెరకెక్కించనున్నారని తాజా సమాచారం. కథానాయకుడి పాత్రలో చిన్న చిన్న మార్పులు చేశారు తప్ప.. కథానాయిక పాత్రను కొత్తగా సృష్టించలేదని తెలుస్తోంది. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.