Board Examsలో హిజాబ్‌కు అనుమతి లేదు...కర్ణాటక విద్యాశాఖ మంత్రి వెల్లడి

Published: Fri, 25 Mar 2022 07:30:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Board Examsలో హిజాబ్‌కు అనుమతి లేదు...కర్ణాటక విద్యాశాఖ మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ: బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినులు కూడా హిజాబ్ ధరించరాదని కర్నాటక ప్రభుత్వం పేర్కొంది.పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్ధినులు హిజాబ్ ధరించేందుకు అనుమతించమని రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ అన్నారు. ‘‘హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అందరూ పాటించి పరీక్షకు హాజరు కావాలి.ఎలాంటి సడలింపులు ఉండవు, విద్యార్థులు హైకోర్టు తీర్పును పాటించాలి, హిజాబ్‌లతో వచ్చే వారిని పరీక్షలకు అనుమతించం’’ అని మంత్రి చెప్పారు.ప్రభుత్వ వైఖరి చాలా మంది ముస్లిం విద్యార్థులను సందిగ్ధంలో పడేసింది. హిజాబ్ పై ముందస్తు విచారణ కోసం చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

పరీక్షలను ఉటంకిస్తూ విద్యార్థినులు వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. హిజాబ్ పై నిషేధం అమలు చేస్తే తాము బోర్డు పరీక్షలకు దూరమవుతామని తమ విజ్ఞప్తిలో పేర్కొన్నారు. అయితే ఈ అంశాన్ని సంచలనం చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం విద్యార్థులను కోరింది. హిజాబ్ కేసు విచారణకు తేదీని ఇవ్వడానికి నిరాకరించింది.హిజాబ్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేయడానికి కర్ణాటక హైకోర్టు గత వారం తన ఉత్తర్వుల్లో నిరాకరించింది. ఇస్లాంలో హిజాబ్ అవసరమైన ఆచారం కాదు అని పేర్కొంటూ విద్యార్థుల పిటిషన్‌ను తోసిపుచ్చింది.

మత స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం హిజాబ్‌కు రక్షణ ఉందని విద్యార్థులు వాదించారు.కర్ణాటక హైకోర్టు హిజాబ్ నిషేధాన్ని సమర్థించినప్పటి నుంచి చాలా మంది విద్యార్థినులు పాఠశాలలు, కళాశాలల నుంచి తప్పుకున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.