హోంవర్క్‌ చేయలేదని బాలికను చితకబాదిన Teacher

ABN , First Publish Date - 2022-07-02T14:37:59+05:30 IST

హోంవర్క్‌ చేయలేదని బాలికను చితకబాదిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. స్థానిక కొరట్టూరులో ఉన్న ఓ ప్రైవేటు

హోంవర్క్‌ చేయలేదని బాలికను చితకబాదిన Teacher

పెరంబూర్‌(చెన్నై), జూలై 1: హోంవర్క్‌ చేయలేదని బాలికను చితకబాదిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. స్థానిక కొరట్టూరులో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో కీర్తన అనే విద్యార్థి 4వ తరగతి చదువుతోంది. తమిళ పాఠంలో ఇచ్చిన హోంవర్క్‌ చేయలేదని టీచర్‌ పార్వతి కర్రతో కీర్తన చేతులు, కాళ్లపై చితకబాదింది. దీంతో, బాలిక కాళ్లు, చేతుల్లో వాతలు తేలాయి. ఈ విషయమై బాలిక తండ్రి కొరట్టూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు టీచర్‌ను విచారిస్తున్నారు.

Updated Date - 2022-07-02T14:37:59+05:30 IST