TS News: విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తాం..ప్రభాకర్‌రావు

ABN , First Publish Date - 2022-08-20T03:42:00+05:30 IST

Hyderabad‌: దేశ వ్యాప్తంగా విద్యుత్ క్రయ విక్రయాలు జరిగే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (IEX) నుంచి లావాదేవీలు జరుపకుండా రాష్ట్రాలపై కేంద్రం నిషేధం విధించింది. తెలంగాణతో పాటు 13 రాష్ట్రాలకు చెందిన 29

TS News: విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తాం..ప్రభాకర్‌రావు

Hyderabad‌: దేశ వ్యాప్తంగా విద్యుత్ (Power) క్రయ విక్రయాలు జరిగే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (IEX) నుంచి లావాదేవీలు జరుపకుండా రాష్ట్రాలపై కేంద్రం నిషేధం విధించింది. తెలంగాణతో పాటు 13 రాష్ట్రాలకు చెందిన 29 విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. డబ్బు చెల్లిస్తున్నా.. కేంద్రం ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఇలా చేయడం బాధాకరమని ట్రాన్స్ కో ,జెన్కో సీఎండీ  ప్రభాకర్ రావు పేర్కొన్నారు.


‘‘కేంద్రం నోటీసులు ఇవ్వకుండా పవర్ పర్చేస్ ఆపేసింది. జనరేటర్, డిస్కంలకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇది వారి ఒప్పందంతో అమ్ముకోవచ్చు. రూ.1,360 కోట్లు చెల్లించినా కేంద్రం ఇలా చేయడం బాధాకరం. ప్రజలకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా..విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే..రైతులు, ప్రజలు సహకరించాలి’’ అని ప్రభాకర్‌రావు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-08-20T03:42:00+05:30 IST