లాంగ్‌ టర్మ్‌ రుణాలు తీసుకోలేదు

ABN , First Publish Date - 2022-08-18T04:31:28+05:30 IST

తాము లాంగ్‌ టర్మ్‌ రుణాలు తీసుకోలేదని, పంట రుణాలు మా త్రమే తీసుకున్నామని రైతులు అన్నారు.

లాంగ్‌ టర్మ్‌ రుణాలు తీసుకోలేదు
డీసీసీబీ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

- డీసీసీబీ ముందు రైతుల నిరసన 

-   ఇన్‌చార్జి మేనేజర్‌కు వినతి పత్రం అందజేత

ఆత్మకూర్‌, ఆగస్టు17: తాము లాంగ్‌ టర్మ్‌ రుణాలు తీసుకోలేదని, పంట రుణాలు మా త్రమే తీసుకున్నామని  రైతులు అన్నారు. బుధవారం జూరాల, ఆరేపల్లి, ఆత్మకూర్‌ గ్రా మాల రైతులు డీసీసీబీ  ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ  2010- 11 సం వత్సరాలలో పం ట రుణాల కోసం బ్యాంకును ఆశ్రయించి పంట రుణం మాత్రమే తీసుకున్నామన్నారు. కానీ  బ్యాంకు అధికారులు మాత్రం లాంగ్‌ టర్మ్‌ రుణం పొందారు తక్షణమే చెల్లించా లని నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. లేనిపక్షంలో   40రోజులు వేచి చూసి తహసీల్దార్‌, గ్రామ సర్పంచ్‌ సమక్షంలో భూములు వేలం వేస్తామని హెచ్చరిస్తున్నారని వాపోయారు. పంట రుణాలు మాత్రమే పొందామని లాంగ్‌ టర్మ్‌ రుణాలు మే ము తీసుకోలేదని వారు బ్యాంకు ఇంచార్జీ మేనేజర్‌ గోపాల్‌ కు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో దుబాయ్‌ కృష్ణయ్య, నరసింహ, దుబ్బన్న, వెం కటన్న, గోపాల్‌, రాజ్‌ కిరణ్‌ తదితరులున్నారు.  ఈ విష యంపై విలేకర్లు  డీసీసీబీ ఇన్‌చార్జి మేనేజర్‌ గోపాల్‌ వి వరణ కోరగా లాంగ్‌టర్మ్‌ రుణాలు పొందినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఆత్మకూర్‌ డీసీసీబీ పరిధిలో ఆత్మకూర్‌, అమరచింత, నర్వ, చిన్నచింతకుంట మండలాలకు సంబం ధించి 300మంది రైతులకుపైగా లాంగ్‌ టర్మ్‌ రుణాలు పొందారు. వాటికి సంబంధించి ఐదు కోట్లకు పైగా రుణాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పంట రుణం కోసం అయితే ఆర్‌వోఆర్‌, పట్టాదార్‌ పాసు బుక్‌, ఆధార్‌  మాత్రమే రైతుల వద్ద నుంచి తీసుకుంటాం గానీ,  లాంగ్‌ టర్మ్‌ రుణాల నిమిత్తం 10సంవత్సరాల క్రితం నుంచి ఓల్డ్‌ ఆర్‌వోఆర్‌, పహాని, పట్టాదారు పాసుబుక్‌ తీసుకొని ఇస్తామన్నారు. రైతులే ఓల్డ్‌ ఆర్‌వోఆర్‌ పహాని తీసుకువచ్చి సాక్షుల సమక్షంలో రుణం పొందారన్నారు. ఇప్పటి వరకు వందమందికి నోటీసులు పంపిణీ చేయగా 34మంది రైతుల నుంచి రూ. కోటి వరకు రికవరీ చేశామని మరో 66మంది రైతుల దగ్గర నుంచి రూ. 1.28 కోట్లు వసూలు కావాల్సి ఉందని, రుణాలు చెల్లించే దశలో ఉన్నారని, మరో 200మందికి మలిదశలో నోటీసులు జారీ చేయనున్నామని ఆయన తెలిపారు.  

Updated Date - 2022-08-18T04:31:28+05:30 IST