పీఎఫ్‌ చందాదారులు వడ్డీ నష్టపోలేదు..

ABN , First Publish Date - 2022-10-07T09:23:32+05:30 IST

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ‘ఈపీఎ్‌ఫఓ’ చందాదారుల్లో ఏ ఒక్కరూ వడ్డీ నష్టపోలేదని, సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ కారణంగానే గత ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేసిన వడ్డీని చందాదారులు ఆన్‌లైన్‌లో చూసుకోలేకపోతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది.

పీఎఫ్‌ చందాదారులు వడ్డీ నష్టపోలేదు..

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ‘ఈపీఎ్‌ఫఓ’ చందాదారుల్లో ఏ ఒక్కరూ వడ్డీ నష్టపోలేదని, సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ కారణంగానే గత ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేసిన వడ్డీని చందాదారులు ఆన్‌లైన్‌లో చూసుకోలేకపోతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. అంతేకాదు, పీఎఫ్‌ ఖాతాల్లోని పూర్తి సొమ్ము సెటిల్‌మెంట్‌తోపాటు పాక్షిక ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వడ్డీతో కలిపే చెల్లింపులు జరుపుతున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఐటీ రంగ ప్రముఖుడు టీవీ మోహన్‌దా్‌స పాయ్‌ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ‘ప్రియమైన ఈపీఎ్‌ఫఓ, నా వడ్డీ ఎక్కడ?’ అంటూ ఆయన చేసిన ట్వీట్‌కు బుధవారం రాత్రి మంత్రిత్వ శాఖ ట్విటర్‌ ద్వారా సమాధానమిచ్చింది.  

Updated Date - 2022-10-07T09:23:32+05:30 IST