యూఎస్ ఫెడరల్ జడ్జి సంచలన ఆదేశాలు...

ABN , First Publish Date - 2022-04-19T17:23:01+05:30 IST

అమెరికా దేశంలో ఫ్లోరిడాలోని టంపా యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి కాథరిన్ కింబాల్ మిజెల్ సంచలన ఆదేశాలు జారీ చేశారు....

యూఎస్ ఫెడరల్ జడ్జి సంచలన ఆదేశాలు...

విమానాలు, రైళ్లలో మాస్క్‌లు ధరించనవసరం లేదు

ఫ్లోరిడా(అమెరికా): అమెరికా దేశంలో ఫ్లోరిడాలోని టంపా యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి కాథరిన్ కింబాల్ మిజెల్ సంచలన ఆదేశాలు జారీ చేశారు.విమానాలు, రైళ్లలో ప్రయాణికులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని జడ్జి ఆదేశించారు.జడ్జి ఆదేశాలతో యూఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ విమానాలు, రైళ్లు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణికులు మాస్కులు ధరించటాన్ని నిలిపివేసింది.యూఎస్ జడ్జి ఆదేశాలతో మంగళవారం నుంచి విమానాశ్రయాలు, ఆన్‌బోర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో మాస్క్‌లు ఐచ్ఛికం అని అలాస్కా ఎయిర్‌లైన్స్ తన వెబ్‌సైట్‌లో  తెలిపింది. మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు నిరాశకరమైన నిర్ణయమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి వ్యాఖ్యానించారు. ప్రజలు మాస్కులు ధరించాలని తాము సిఫార్సు చేస్తూనే ఉన్నామని జెన్ చెప్పారు.కాగా డల్లాస్ నుంచి మయామికి అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ముసుగులు ధరించారు.


Updated Date - 2022-04-19T17:23:01+05:30 IST