ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదు: సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-03-21T23:41:46+05:30 IST

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని సీఎం

ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదు: సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్‌లో ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు.  2018 నాటి పరిస్థితులు రాష్ట్రంలో ఇప్పుడు లేవన్నారు. ఆరు నూరైనా ముందస్తు ముచ్చటే లేదన్నారు. ప్రభుత్వ పథకాలు పూర్తి చేయాల్సి ఉన్నందున గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లామని ఆయన పేర్కొన్నారు. ఈసారి 95 నుంచి 105 స్థానాల్లో మేం గెలుస్తామన్నారు. 30 స్థానాల్లో సర్వే చేస్తే 29 చోట్ల గెలుస్తామని రిపోర్ట్‌ వచ్చిందని ఆయన తెలిపారు. ఆ ఒక్క సీటు కూడా 0.3 ఓట్ల తేడాతో పోతుందని తేలిందని ఆయన పేర్కొన్నారు. 


ప్రశాంత్‌ కిశోర్‌ తనతో కలిసి పనిచేస్తున్నాడని, అయితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. దేశంలో పరివర్తన కోసం తాను ప్రశాంత్‌ కిశోర్‌తో కలిసి పనిచేస్తానన్నారు. గత 8 ఏళ్లుగా పీకేతో తనకు స్నేహం ఉందన్నారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో చాలా శూన్యత ఉందన్నారు. కొత్త జాతీయ పార్టీ వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-21T23:41:46+05:30 IST