ఇప్పట్లో ఎత్తిపోతలు లేనట్టే!

ABN , First Publish Date - 2020-07-07T07:23:59+05:30 IST

కాళేశ్వరం వద్ద ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహితలో వరద క్రమేణా పెరుగుతోంది. రెండు రోజుల క్రితం 8వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ప్రస్తుతం అది 33వేల క్యూసెక్కులకు పెరిగింది. మేడిగడ్డ బ్యారేజీలో 8.089 టీఎంసీల

ఇప్పట్లో ఎత్తిపోతలు లేనట్టే!

భూపాలపల్లి, జూలై 6(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం వద్ద ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహితలో వరద క్రమేణా పెరుగుతోంది. రెండు రోజుల క్రితం 8వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ప్రస్తుతం అది 33వేల క్యూసెక్కులకు పెరిగింది.   మేడిగడ్డ బ్యారేజీలో 8.089 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, పది గేట్లు ఎత్తి 11వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు ఎగువ గోదావరిలోకి సైతం భారీగా వరద వస్తుండడంతో కాళేశ్వరం నుంచి ఇప్పట్లో నీటిని ఎత్తిపోసే అవకాశం లేదని తెలుస్తోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వర్షాలు తగ్గాకే లిఫ్టులు మొదలు పెట్టాలని ఇంజనీర్లు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత సీజన్‌లో ఇటీవలే మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు పడితే వరద మరింత పెరిగే అవకాశాలున్నాయని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తి పోసినా వ్యర్థమేనని అధికారులు భావిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పడితే 10-15 రోజుల తర్వాత మోటార్లను ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Updated Date - 2020-07-07T07:23:59+05:30 IST