
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ CM JAGANMOHAN REDDYపై TDP నేత, ఏపీ మాజీ మంత్రి Palle Raghunath Reddy విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న సీఎంలో చలనం లేదని మండిపడ్డారు. ఏపీలో పాలన రోజుకు 3 నేరాలు, ఆరు ఘోరాలుగా ఉందని పల్లెరఘునాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా హోంమంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటని మంత్రి అన్నారు. జగన్ పాలనలో పోలీసులది ప్రేక్షక పాత్రే అని, మహిళల కంట కన్నీరు వస్తే రాష్ట్రానికే అరిష్టమని ఆయన అన్నారు. అత్యాచారాలకు పాల్పడిన వారికి కఠిన శిక్ష వేయాలని, బాధిత మహిళల కుటుంబానికి 50 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జగన్ (JAGAN) సర్కారుకు మాజీ మంత్రి Raghunath Reddy రెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి