
న్యూఢిల్లీ : పెట్రోలు & డీజిల్ ధరల్లో కోత, కొన్ని ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకంలో సడలింపుల కారణంగా ఆదాయాన్ని వదులుకున్నప్పటికీ, భారత్‌కు అదనపు రుణాలు అవసరం ఉండకపోవచ్చునని ఆయా వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రకారం... 2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రూ. 14.3 లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత వారం, ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని వరుసగా రూ. 6, రూ. 8 చొప్పున తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... ప్రభుత్వానికి ఆదాయ అంచనాల ప్రకారం రూ. లక్ష కోట్ల నష్టం వాటిల్లింది. కాగా... ‘మా రుణ క్యాలెండర్‌కు కట్టుబడి ఉన్నాం. అదనపు రుణాల ప్రతిపాదన లేదు. సవరించిన ఆర్థిక లోటు లక్ష్యాన్ని కేంద్రం చూడటం లేదు. మా ఆదాయ నష్టాలను సమతుల్యం చేయగలం’ని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి