కోవిడ్ పరిస్థితిపై ఆందోళన వద్దు: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-04-12T19:23:30+05:30 IST

దేశ రాజధానిలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్..

కోవిడ్ పరిస్థితిపై ఆందోళన వద్దు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధైర్యం చెప్పారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, భయపడాల్సిన పని లేదని అన్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. పరిస్థితిలో మార్పులొస్తే అందుకు తగినట్టుగా అన్ని చర్యలు తీసుకుంటామని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.


ఢిల్లీలో కోవిడ్ పాజిటివిటీ రేటు 2.70గా నమోదు కావడంతో సిటీలో మళ్లీ కోవిడ్ తలెత్తిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 4న కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5కు పెరిగి ప్రస్తుతం 2.70 శాతానికి చేరింది. దీనిపై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ, కోవిడ్ పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించిందని, కొత్త వేరియంట్ కనుగొనేంతవరకూ ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. ఢిల్లీలో ప్రతిరోజు 100 నుంచి 200 కేసులు నమోదు అవుతున్నానని చెప్పారు.

Updated Date - 2022-04-12T19:23:30+05:30 IST