ఎల్‌పీజీ గ్యాస్ కొత్త కనెక్షన్‌కు... ఆధార్ నంబర్, అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు...

ABN , First Publish Date - 2021-08-04T23:10:55+05:30 IST

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌పీజీ కనెక్షన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది.

ఎల్‌పీజీ గ్యాస్ కొత్త కనెక్షన్‌కు... ఆధార్ నంబర్, అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు...

 ముంబై :  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)  కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌పీజీ కనెక్షన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఈ నేపధ్యంలో... ఇకపై ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ వివరాలను అందించాల్సిన అవసరం లేదు. 


 ఏదైనా అధికారిక ఐడెంటిటీ ప్రూఫ్ అందిస్తే సరిపోతుందని ఐఓసీఎల్ వెల్లడించింది. డిస్ట్రిబ్యూటర్లు లేదా కంపెనీలు గతంలో ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలంటే వినియోగదారుల నుంచి ఖచ్చితంగా అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ వివరాలను తీసుకునేవారు. ఐదు కేజీల ఇండేన్ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ కోసం ఈ మార్పులు తీసుకొచ్చారు. 

Updated Date - 2021-08-04T23:10:55+05:30 IST