అంతర్రాష్ట్ర బస్సులకు రాత్రి కర్ఫ్యూ మినహాయింపు

ABN , First Publish Date - 2021-04-22T09:54:50+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో రాత్రిపూట బస్సులు నిలిపివేసే విషయంలో అంతర్రాష్ట్ర సర్వీసులకు మినహాయింపు లభించింది. తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించడం వల్ల ఆ సమయంలో బస్సులను నడపకూడదని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

అంతర్రాష్ట్ర బస్సులకు రాత్రి కర్ఫ్యూ మినహాయింపు


  • విజయవాడ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకు యథాతథం

విజయవాడ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో రాత్రిపూట బస్సులు నిలిపివేసే విషయంలో అంతర్రాష్ట్ర సర్వీసులకు మినహాయింపు లభించింది. తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించడం వల్ల ఆ సమయంలో బస్సులను నడపకూడదని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విజయవాడ నుంచి రోజూ రాత్రి బయల్దేరే అంతర్రాష్ట్ర సర్వీసుల విషయంలో సందిగ్ధం ఏర్పడింది. అయితే ఈ సమస్యను కేంద్రమే పరిష్కరించింది. అంతర్రాష్ట్ర బస్సుల విషయంలో ఆంక్షలు విధించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దీంతో విజయవాడ నుంచి తెలంగాణ, బెంగళూరు, చెన్నైకు రాకపోకలు సాగించేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండాపోయింది. 

Updated Date - 2021-04-22T09:54:50+05:30 IST