విమ్స్‌లో ఆక్సిజన్‌ అందక ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2022-09-15T17:03:48+05:30 IST

బళ్లారిలోని విజయనగర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌ (విమ్స్‌)లో ముగ్గురు రోగులు బుధవారం సకాలంలో ఆక్సిజన్‌(Oxygen)

విమ్స్‌లో ఆక్సిజన్‌ అందక ముగ్గురి మృతి

బళ్లారి(బెంగళూరు), సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): బళ్లారిలోని విజయనగర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌ (విమ్స్‌)లో ముగ్గురు రోగులు బుధవారం సకాలంలో ఆక్సిజన్‌(Oxygen) అందక మృతి చెందారు. మౌలాహుసేన్‌ (45), చిట్టెమ్మ(40) పాము కాటుతో వైద్యం పొందుతుండగా, చందనమ్మ (60) అనే మరో మహిళ కిడ్నీ సమస్యతో చికిత్స కోసం వచ్చారు. వీరికి ఐసీయూలో వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. ఈ యూనిట్‌కు సరిగ్గా విద్యుత్‌ సరఫరా కావడం లేదు. దీనికి తోడు ఇన్వర్టర్లు కూడా పనిచేయలేదు. దీంతో రోగులకు సకాలంలో ఆక్సిజన్‌ అందక మృతి చెందారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అయింది. కొందరు ప్రజా సంఘాల నాయకులు విమ్స్‌ వద్ద ధర్నా చేశారు. ఈ ఘటనపై విమ్స్‌ డైరెక్టర్‌ గంగాధర గౌడను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. ఇదే విషయంపై కలెక్టర్‌ పవన్‌ కుమార్‌ మాలపాటిని వివరణ కోరగా ఘటనపై విచారిస్తామని తెలిపారు. వైద్య రం గంలో ఎంతో చరిత్ర ఉన్న విమ్స్‌లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-09-15T17:03:48+05:30 IST