India-UAE flights: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2022-02-27T14:45:43+05:30 IST

భారత్ నుంచి యూఏఈ వెళ్లే ప్రయాణికులను ఉద్దేశించి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా కీలక ప్రకటన చేసింది.

India-UAE flights: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక ప్రకటన!

ఇంటర్నెట్ డెస్క్: భారత్ నుంచి యూఏఈ వెళ్లే ప్రయాణికులను ఉద్దేశించి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు ప్రీ ట్రావెల్ కోవిడ్-19 పీసీఆర్ పరీక్ష అవసరం లేదని స్పష్టం చేసింది. యూఏఈ ప్రభుత్వం శుక్రవారం నుంచి ఆ దేశంలో ప్రవేశానికి సంబంధించి పలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఈ ప్రకటన చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన లేదా యూఏఈలో గుర్తింపు పొందిన టీకాలలో రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైన వారు దాని తాలూకు సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది. ఇక వ్యాక్సినేషన్ పూర్తికాని ప్రయాణికులు జర్నీకి 48 గంటల ముందు పీసీఆర్ టెస్టు చేయించుకున్న తర్వాత వచ్చి నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. అది కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రి లేదా లాబొరేటరీలో టెస్టు చేయించుకున్నదై క్యూఆర్ కలిగి ఉండాలి. అలాగే విమానాశ్రయంలో దిగగానే మరోసారి పీసీఆర్ టెస్టు నిర్వహిస్తారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో ప్రయాణించే వారందరికీ ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. శనివారం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-27T14:45:43+05:30 IST