పోలీసు వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండదు : మహారాష్ట్ర కొత్త హోం మంత్రి

ABN , First Publish Date - 2021-04-06T21:40:50+05:30 IST

పోలీస్ అడ్మినిస్ట్రేషన్‌లో రాజకీయ జోక్యం ఉండబోదని

పోలీసు వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండదు : మహారాష్ట్ర కొత్త హోం మంత్రి

ముంబై : పోలీస్ అడ్మినిస్ట్రేషన్‌లో రాజకీయ జోక్యం ఉండబోదని మహారాష్ట్ర నూతన హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ చెప్పారు. మహిళల రక్షణ, భద్రతలకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. శక్తి చట్టాన్ని ఆమోదిస్తామన్నారు. పోలీసు సిబ్బందికి ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఆయన హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. 


నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత దిలీప్ వాల్సే పాటిల్ మంగళవారం మహారాష్ట్ర హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు బోంబే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎన్‌సీపీ నేత, హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో పాటిల్‌కు ఆ పదవి దక్కింది. బోంబే హైకోర్టు నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందని పాటిల్ చెప్పారు. పోలీస్ అడ్మినిస్ట్రేషన్‌లో రాజకీయ జోక్యం ఉండబోదని తెలిపారు. 


Updated Date - 2021-04-06T21:40:50+05:30 IST