పొగ రహితంగా భోగి

ABN , First Publish Date - 2022-01-13T13:53:39+05:30 IST

రాష్ట్ర ప్రజలు గురువారం సంప్రదాయ బోగి పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణా మండలి విజ్ఞప్తి మేరకు టైర్లు, ప్లాస్టిక్‌ తదితరాలు లేకుండా భోగి మంటలు వేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు

పొగ రహితంగా భోగి

- అధికారుల విజ్ఞప్తి 

- నేతల శుభాకాంక్షలు


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్ర ప్రజలు గురువారం సంప్రదాయ బోగి పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణా మండలి విజ్ఞప్తి మేరకు టైర్లు, ప్లాస్టిక్‌ తదితరాలు లేకుండా భోగి మంటలు వేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మూడు రోజులపాటు జరిగే పండుగ తొలిరోజు భోగిని ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. చాలాకాలంగా సేకరించి పెట్టుకున్నపాతకట్టెలు, పుల్లలు, ఇతర వస్తువులను భోగి మంటల్లో వేసి తగులబెడతారు. మరి కొంతమంది సంప్రదాయ పాటలు ఆలపిస్తూ, భోగి మంటలు వేస్తారు. తరతరాలుగా కొనసాగుతున్న భోగి పండ్ల ఆచారాన్ని కొన్ని ఇళ్లలో నిర్వహించనున్నారు.   


నేతల శుభాకాంక్షలు: సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్య మంత్రి స్టాలిన్‌, ప్రతిపక్ష నేత ఎడ ప్పాడి పళనిస్వామి తదితర నేతలంతా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా బారి నుంచి ప్రజలందరూ బయటపడాలని ఆకాంక్షిస్తున్నా ను. సంక్రాంతి వేడుకలను కరోనా నిబంధనలతో జరుపుకుంటే నేనూ సంతోషిస్తాను. పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నా’’అని ముఖ్యమంత్రి తెలిపిన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. అన్నాడీఎంకే సమ న్వయకర్త ఒ.పన్నీర్‌ సెల్వం, ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళని స్వామి సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో... ‘ప్రపంచ వ్యాప్తంగా వున్న తమిళులు ఆనందో త్సాహల నడుమ జరుపుకోవాలి. భోగి, తైపొంగల్‌, మాట్టు పొంగల్‌, కానుం పొంగల్‌ జరుపు కునే ప్రజలు కరోనా నివారణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-01-13T13:53:39+05:30 IST