నీటి సరఫరాను ప్రైవేటుపరం చేయం: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-09-26T21:10:30+05:30 IST

ఢిల్లీలో నీటి సరఫరాను ప్రైవేటుపరం చేయనున్నట్టు కొందరు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ప్రచారంలో..

నీటి సరఫరాను ప్రైవేటుపరం చేయం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీలో నీటి సరఫరాను ప్రైవేటుపరం చేయనున్నట్టు కొందరు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఢిల్లీలో నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించేందుకు ఒక కన్సెల్టెంట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.


శనివారంనాడు మీడియాతో క్రేజీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీ జల్ బోర్డు అధికారులతో ఇటీవల సమావేశం ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నిరంతరాయ నీటి సరఫరాకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఒక కన్సెల్టెంట్‌ను నియమించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. ఢిల్లీలో నీటి లభ్యత పెంచేందుకు పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వాలతో చర్చలు సాగిస్తున్నామని, ఇదే సమయంలో అందుబాటులో ఉన్న నీటి సక్రమ వినియోగానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.

Updated Date - 2020-09-26T21:10:30+05:30 IST