జిల్లా పేరులోనే భద్రాద్రి.. అభివృద్ధిలో లేదు పురోగతి

ABN , First Publish Date - 2021-03-01T06:00:00+05:30 IST

భద్రాద్రి జిల్లా పేరులోనే భద్రాచలం ఉంది తప్ప అభివృద్ధిలో మాత్రం పురోగతి లేదని యువ తెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణిరుద్రమరెడ్డి అన్నారు.

జిల్లా పేరులోనే భద్రాద్రి.. అభివృద్ధిలో లేదు పురోగతి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాణిరుద్రమరెడ్డి

 భద్రాచలం ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాం
 యువ తెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణిరుద్రమరెడ్డి

భద్రాచలం, ఫిబ్రవరి 28 : భద్రాద్రి జిల్లా పేరులోనే భద్రాచలం ఉంది తప్ప అభివృద్ధిలో మాత్రం పురోగతి లేదని యువ తెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణిరుద్రమరెడ్డి అన్నారు. ఆదివారం ఆమె భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రాచలం అభివృద్ధికి పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నామన్నారు. భద్రాద్రి ఆత్మగౌరవ పోరాటానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థ లు, పలు పార్టీలు, సంఘాల నుంచి మద్దతు లభించడం ఆనందంగా ఉందన్నారు. భద్రాద్రి అభివృద్ధికి ప్రధాన సమస్యగా మారిన ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలన్నారు. అదేవి ధంగా భద్రాచలం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌  ఇస్తానని హామీ ఇచ్చి న రూ.150కోట్లను తక్షణమే విడుదల చేసి భద్రాచలం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అనాదిగా వస్తున్న ఆచారం  ప్రకారం భద్రాద్రి రామయ్యకు సీఎం కేసీఆర్‌ ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించాలనే మూడు అంశాలతో పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.  ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం భద్రాద్రి అభివృద్ధి కోసం ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఇంతవరకు ఒక్క మహిళకు సైతం అవకాశం దక్కలేదని, ఈ సారి తనకు అవకాశం ఇచ్చిన గెలిపించాలని కోరారు.  సమావేశంలో నాయకులు అరుణ్‌, విష్ణు, మధు, ఉదయ్‌, దాసు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T06:00:00+05:30 IST