మొక్కకు లేదు రక్షణ

ABN , First Publish Date - 2021-01-24T05:40:47+05:30 IST

అటవీ శాఖ సామాజిక విభాగం ద్వారా నాటుతున్న మొక్కలకు సంరక్షణ కరువైంది. అధికారులు మొక్కలు నాటి నిర్లక్ష్యంగా వదిలేస్తు న్నారు. ఫలితంగా వేల సంఖ్యలో మొక్కలు చనిపోతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, రహదారుల పక్కన, ప్రభుత్వం కొత్తగా ఇళ్ల పట్టాలు ఇస్తున్న ప్రాంతాల్లో ‘జగనన్న పచ్చతోరణం’ కింద ఉపాధి నిధులతో విస్తృతంగా మొక్కలు నాటారు. సంరక్షణ బాధ్యతలు మాత్రం మరచిపోయారు. కనీసం నీరు పోసే నాథుడే కరువయ్యాడు. దీంతో కొద్దిరోజుల్లోనే వేలసంఖ్యలో మొక్కలు చనిపో యాయి.

మొక్కకు లేదు రక్షణ
కోసమాళలో మొక్కలకు రక్షణ లేని దృశ్యం

 సంరక్షణ బాధ్యత గాలికి

 వేల సంఖ్యలో చనిపోతున్న వైనం

 బిల్లులు మాత్రం చెల్లింపు

 రూ.లక్షల్లో నిధులు వృథా

(మెళియాపుట్టి)

అటవీ శాఖ సామాజిక విభాగం ద్వారా నాటుతున్న మొక్కలకు సంరక్షణ కరువైంది. అధికారులు మొక్కలు నాటి నిర్లక్ష్యంగా వదిలేస్తు న్నారు. ఫలితంగా వేల సంఖ్యలో మొక్కలు చనిపోతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, రహదారుల పక్కన, ప్రభుత్వం కొత్తగా ఇళ్ల పట్టాలు ఇస్తున్న ప్రాంతాల్లో ‘జగనన్న పచ్చతోరణం’ కింద ఉపాధి నిధులతో విస్తృతంగా మొక్కలు నాటారు. కేవలం గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో 811 పనులకు గాను 611 కిల్లో మీటర్లు పరిధిలో వివిధ రకాలకు చెందిన 2.44 లక్షల మొక్కలు నాటారు. దీనికోసం ఉపాధి హమీ నిధులతో పాటు అటవీ శాఖ నిధులు సుమారు రూ.2030.23 లక్షలు ఖర్చు చేశారు. సంరక్షణ బాధ్యతలు మాత్రం మరచిపోయారు. కనీసం నీరు పోసే నాథుడే కరువయ్యాడు. దీంతో కొద్దిరోజుల్లోనే వేలసంఖ్యలో మొక్కలు చనిపో యాయి. కంచెలు కూడా పాడయ్యాయి. మొక్కలు ఎన్ని చనిపోయా యి? ఎన్ని బతికి ఉన్నాయో లెక్క తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి ఏడాది నాటిన చోటే నాటుతున్నా మొక్కలు బతికిన పాపాన పోలేదు. గత నాలుగేళ్ల నుంచి మెళియాపుట్టి-టెక్కలి రోడ్టులో మెళియాపుట్టి నుంచి మర్రిపాడు వరకు రెండు కిలోమీటర్ల రహదారికి ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. దీనికోసం లక్షల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా ఒక్కటీ బతకలేదు.

 

ఠంఛనుగా బిల్లులు..


ప్రతి రెండు వందల మొక్కల పర్యవేక్షణకు ఉపాధి వేతనదారుల నుంచి ఒకరిని  సంరక్షకుడిగా నియమించారు. నాటిన మొక్కలకు నీరు పోయడం, వాటి చుట్టూ ముళ్లకంచె నిర్మించడం వీరి పని. దీనికోసం వారికి ఒక మొక్కకు రూ.4.25 పైసల చొప్పున చెల్లిస్తారు. గతంలో మూడు రూపాయలే ఇచ్చేవారు. ఇటీవలే రూ.1.25 పైసలు పెంచారు. సంరక్షకుల్లో ఎక్కువమంది ఫీల్డ్‌అసిస్టెంట్లకు అనుకూలంగా ఉన్న అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. దీనివల్ల మొక్కలు చనిపో తున్నా, అధికారులు వారిని అడిగే పరిస్థితి కనిపించడం లేదు. మొక్క బతకకపోయినా బిల్లులు మాత్రం యథావిధిగా చెల్లిస్తున్నారు. బతికిన మొక్కకే డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొక్కలను సంరక్షించాల్సి ఉంది.  


సంరక్షకులే బాధ్యత తీసుకోవాలి

మొక్కల సంరక్షణకు ఉపాధి వేతనదారుల నుంచి కొందరిని నియమించాం. మొక్కలు చనిపోతే వాటి స్థానంలో సంరక్షకులతోనే కొత్తవి నాటిస్తాం. నీరు పోయడంతో పాటు కంచె ఏర్పాటు చేసే బాధ్యత వారే తీసుకోవాలి. నాటిన మొక్కలను లెక్కించి డబ్బులు చెల్లిస్తాం.

-సురేష్‌ ఏపీవో, మెళియాపుట్టి

Updated Date - 2021-01-24T05:40:47+05:30 IST