లోకేష్‌ను విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదు

ABN , First Publish Date - 2021-06-23T04:08:58+05:30 IST

మాజీ మంత్రి నారాలోకేష్‌ను విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు.

లోకేష్‌ను విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల

వెంకటగిరి, జూన్‌ 22: మాజీ మంత్రి నారాలోకేష్‌ను విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. మంగళవారం తన నివాసంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హత్యారాజకీయాలు చేసే వైసీపీ నాయకులు లోకేష్‌పై చేస్తున్న విమర్శలు దయ్యాలు వేదాలు వల్లించిట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇకనైనా వారు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. నిత్యావసరాల నుంచి పెట్రోల్‌, డీజిల్‌  ధరల వరకూ అన్నింటినీ పెంచేయడంతో సామాన్యుడి జీవనం గగనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వం ఆస్తి, చెత్త సేకరణపై  పన్నులు విధించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన టీడీపీ ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు.  

అవినీతిపై తెలుసా..తెలియదా!

వెంకటగిరి రూరల్‌ మండలం, మున్సిపాలిటీల్లో అధికారుల అవినీతి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. నెలల తరబడి బాలాయపల్లి తహసీల్దారును వెంకటగిరి ఇన్‌చార్జిగా నియమించడం వల్ల ఆయన చేసే అవినీతి అంతింతా కాదన్నారు. అందుకు తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు పులికొల్లు రాజేశ్వరావు, కేవీకే ప్రసాద్‌ నాయుడు, సుబ్బు యాదవ్‌, చలపతి ఉన్నారు.


Updated Date - 2021-06-23T04:08:58+05:30 IST