విద్యాశాఖ అధికారులపై సస్పెన్షన్‌ వేటు

ABN , First Publish Date - 2022-07-06T05:35:52+05:30 IST

నిజామాబాద్‌ మండల మాజీ ఎంఈవో సాయిలు (ప్రస్తుతం తిర్మన్‌పల్లి కాంప్లెక్స్‌ హెచ్‌ఎం), డిప్యూటీ డీఈవో కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ బద్దం శ్రీనివాస్‌ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు.

విద్యాశాఖ అధికారులపై సస్పెన్షన్‌ వేటు

కారుణ్య నియామకం కోసం బోనాఫైడ్‌లో పేరు మార్పిడి

మాజీ ఎంఈవో, జూనియర్‌ అసిస్టెంట్‌పై సస్పెన్షన్‌ వేటు 

నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 5: నిజామాబాద్‌ మండల మాజీ ఎంఈవో సాయిలు (ప్రస్తుతం తిర్మన్‌పల్లి కాంప్లెక్స్‌ హెచ్‌ఎం), డిప్యూటీ డీఈవో కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ బద్దం శ్రీనివాస్‌ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణ, పీజీ హెచ్‌ఎం సాయిలును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ డీఈవో కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ బద్దం శ్రీనివాస్‌ను డీఈవో దుర్గాప్రసాద్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.   మండల పరిధిలోని నాందేవ్‌వాడలో ఒక ప్రైవేటు పాఠశాలలో చదివిన ఓ వ్యక్తి తన తండ్రి ద్వారా కారుణ్య నియామకం కోసం విద్యుత్‌ శాఖలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతడి బోనాఫైడ్‌లో తండ్రి పేరు బాలయ్యకు బదులు బాల్‌రాజ్‌ అని ఉండడం తో దాని మార్పిడి కోసం అప్పటి ఎంఈవో సాయిలును సంప్రదించాడు. డిప్యూటీ డీఈవో కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ బద్దం శ్రీనివాస్‌తో పాటు సాయిలు కలిసి బోనాఫైడ్‌లో బాల్‌రాజ్‌కు బదులు బాలయ్య అని మార్పిడి చేశారు. దానితో అతడు కారుణ్య నియామక పత్రాన్ని సమర్పించారు. విజిలెన్స్‌ విచారణ చేయగా, పేరుతప్పుగా ఉన్నట్లు గు ర్తించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో ఆ ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు పడింది.

 షోకాజ్‌ నోటీసులు జారీ

ఇందల్వాయి మండలం కేకే తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వెం కటేశ్వరగౌడ్‌, పాల వేణులకు డీఈవో దుర్గాప్రసాద్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సమాచారం లేకుండా క్లాసులకు డుమ్మా కొట్టడంపై వివరణ కోరారు. ఉపాధ్యాయులపై ఎందు కు చర్య తీసుకోవద్దని మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌ గౌడ్‌, ఇందల్వాయి మండల పీఆర్‌టీ యూ అధ్యక్షుడు పాల వేణు పాఠశాలకు హాజరు కాకుండా డుమ్మాలు కొడుతుండడంతో సోమవారం తండావాసులు పాఠశాలకు తాళం వేసేందుకు ప్రయత్నించారు.

Updated Date - 2022-07-06T05:35:52+05:30 IST