టెస్టులు లేవు.. టీకా లేదు!

ABN , First Publish Date - 2021-05-07T05:36:49+05:30 IST

జిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా కరోనా టెస్టులు అం తంతమాత్రంగానే చేస్తుండడంతో టెస్టుల కోసం ప్రజలు ప రీక్షా కేంద్రాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

టెస్టులు లేవు.. టీకా లేదు!

జిల్లాలో పెరుగుతున్న కరోనా తీవ్రత

టెస్టుల కోసం తప్పని నిరీక్షణ

టీకాల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

తరచూ మొరాయిస్తున్న సర్వర్‌

ఇబ్బందుల్లో సెకండ్‌డోస్‌ టీకాదారులు

నిజామాబాద్‌అర్బన్‌, మే 6: జిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా కరోనా టెస్టులు అం తంతమాత్రంగానే చేస్తుండడంతో టెస్టుల కోసం ప్రజలు ప రీక్షా కేంద్రాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మొ న్నటి వరకు ప్రతీరోజు 5వేల మందికి జిల్లావ్యాప్తంగా కరోనా టెస్టులు నిర్వహించిన అధికారులు.. గత రెండు రోజుల నుం చి టెస్టుల సంఖ్య సగానికి తగ్గించడంతో టెస్టుల కోసం పరీక్ష కేంద్రాల వద్ద వేచి ఉండాల్సిప సరిస్థితులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 43 పరీక్ష కేంద్రాల్లో కొవిడ్‌ నిర్ధారణ టెస్టులు చే స్తున్నారు. అయితే, గతంలో ప్రతీ కేంద్రంలో 100 నుంచి 150 మందికి టెస్టులు నిర్వహించేవారు. కానీ, గత రెండు రో జులుగా ప్రతీ కేంద్రంలో కేవలం 20 నుంచి 30 మందికే టె స్టులు నిర్వహిస్తుండడంతో టెస్టుల కోసం వచ్చి అనేకమంది వెనుదిరుగుతున్నారు. టీకాలపై అవగాహన పెరగడంతో చా లా మంది టీకాల కోసం పీహెచ్‌సీల చుట్టూ తిరుగుతున్న ఆన్‌లైన్‌ నిబంధనలతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రతీరోజు కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ప్రస్తుతం టీకాలు ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ ద్వారా టీకాలు ఇవ్వా లని అధికారులు నిర్ణయించడంతో సర్వర్‌ ప్రాబ్లంతో టీకాల కోసం స్లాట్‌ బుకింగ్‌ కాకపోవడంతో టీకా వేసుకోవాలని అ నుకునేవారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇదివరకు జ నంతో కిటకిటలాడిన పీహెచ్‌సీలు ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా టీకాలు ఇస్తుండడంతో జనం లేక అవన్నీ వెలవెలబోతున్నా యి. మొదటి డోసు ఎలాగోలా వేసుకున్న టీకాదారులు సె కండ్‌ డోస్‌ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌చేసుకోవడం ఇబ్బం దికరంగా మారింది. జిల్లాలో కేసుల సంఖ్య రోజురోజుకూ పె రుగుతుండగా ఆసుపత్రులలో కరోనా రోగులకు బెడ్‌లు దొర కని పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో కొన్ని బెడ్‌లు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రైవేట్‌ ఆసుపత్రులలో మాత్రం బెడ్‌లు ఖాళీగా లేవని చెబుతున్నారు. దీంతో కరోనా బారినపడ్డ రో గుల పరిస్థితి దారుణంగా మారింది.

తగ్గిన కరోనా పరీక్షల సంఖ్య 

 జిల్లావ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలతో పాటు నగరంలో ఉ న్న పీహెచ్‌సీలలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను తగ్గించారు. గతంలో ప్రతీ కేంద్రంలో 200ల వరకు టెస్టులు నిర్వ హించిన అధికారులు గత రెండు రోజులుగా టెస్టుల సంఖ్య ను గణనీయంగా తగ్గించారు. టెస్టింగ్‌ కిట్లు సరిపడా లేకపోవడంతో ప్రతీరోజు ఒక్కో పీహెచ్‌సీలో కేవలం 20 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. కరోనా తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్న దృష్ట్యా టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచాల్సి ఉండ గా టెస్టుల సంఖ్యను తగ్గించడంతో ప్రజలు టెస్టుల కోసం ప్రైవేటులో వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. టెస్టులతో పాటు పీహెచ్‌సీల పరిధిలో టీకాల సంఖ్యను కూ డా తగ్గించారు. కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వారికి టీకాలు ఇస్తున్నారు. 

సెకండ్‌ డోస్‌ టీకాదారులకు తప్పని నిరీక్షణ

ఎలాగోలా కష్టపడి మొదటి డోస్‌ వేసుకున్న టీకాదారులు సెకండ్‌ డోస్‌ కోసం వేచిచూడాల్సిన పరిస్థితి జిల్లావ్యాప్తంగా ఉంది. 28 నుంచి 42 రోజుల్లోగా సెకండ్‌ డోస్‌ టీకా వేసుకోవాలని అధికారులు చెప్పగా.. ప్రస్తుతం సెకండ్‌ డోస్‌ కోసం సరిపడా టీకా లేకపోవడంతో వారంతా అయోమయానికి గుర వుతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 80వేల మంది సె కండ్‌డోస్‌ టీకా కోసం ఎదురుచూస్తున్నారు. గత శనివారం నుంచి టీకాలేక జిల్లావ్యాప్తంగా టీకా కార్యక్రమాన్ని నిలిపివేయగా మంగళవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ర్టేషన్‌ చే సుకున్నవారికే టీకా ఇస్తామని అధికారులు ప్రకటించడంతో సెకండ్‌ డోస్‌ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ ఎలా చేయాలో తెలియని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. 

తప్పని ఆన్‌లైన్‌ కష్టాలు 

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటేనే టీకా అనే నిబంధనతో వ్యాక్సిన్‌ వేసుకోవాలనుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి టీకా ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇంకా రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో వారంతా టీకా కోసం ఎదురుచూస్తున్నారు. 45 ఏళ్లు పైబడినవారు టీకా వేసుకోవడానికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలంటే సర్వర్‌ ప్రాబ్లంతో ఇ బ్బంది పడుతున్నారు. చాలా చోట్ల ఇంటర్‌నెట్‌, స్మార్ట్‌ఫోన్‌ లు లేకపోవడంతో ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌ ఏవిధంగా చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. సెకండ్‌ డోస్‌  రిజిస్ర్టేషన్‌ కోసం ప్రయత్నిస్తే జిల్లా కేంద్రంలోని వ్యాక్సిన్‌ సెంటర్‌లు కాకుండా దూర ప్రాంతాల్లోని వ్యాక్సిన్‌ సెంటర్‌ల ను చూపిస్తుండడంతో వారంతా సెకండ్‌ డోస్‌ ఎలా వేసుకోవాలో అయోమయానికి గురవుతున్నారు.

Updated Date - 2021-05-07T05:36:49+05:30 IST