కాదిది రైలుబండి... ఇసుక ట్రాక్టర్ల వరుసండీ!

ABN , First Publish Date - 2021-07-24T04:44:52+05:30 IST

కాదిది రైలుబండి... ఇసుక ట్రాక్టర్ల వరుసండీ!

కాదిది రైలుబండి... ఇసుక ట్రాక్టర్ల వరుసండీ!
వంశధార నదిలో ఇసుక కోసం వరుసలో ఉన్న ట్రాక్టర్లు

ఈ చిత్రం చూశారా... రైలుబండి వెళుతున్నట్టు కనిపిస్తోంది కదూ. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కరజాడ-మడపాం మధ్య  వంశధార నదిలో ఇసుక కోసం ట్రాక్టర్లు క్యూ కట్టిన దృశ్యమిది. జిల్లాలో ఏడు ప్రాంతాల్లో ఇసుక ర్యాంపులకు అనుమతి ఇచ్చారు. వాటిలో స్థానిక అవసరాల కోసం కరజాడ, మడపాం ఇసుక ర్యాంపులు కేటాయించారు. దీంతో ఈ ర్యాంపుల వద్ద ట్రాక్టర్లు తెల్లవారు జాము నుంచే క్యూ కడుతున్నాయి. వీటిలో అధికారంగా కొన్ని లోడింగ్‌ చేస్తుండగా... మరికొన్ని ‘జగనన్న కాలనీల’ పేరుతో దోపిడీ చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

- నరసన్నపేట


Updated Date - 2021-07-24T04:44:52+05:30 IST