
పారిస్: టెన్నిస్ స్టార్ ఆటగాడు, వరల్డ్ నెంబర్ జకోవిచ్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోనందుకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడటానికి వీల్లేదంటూ ఆస్ట్రేలియా వీసా రద్దు చేయడంతో ఖంగుతిన్న జకోవిచ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వ్యాక్సిన్ తీసుకోకపోతే ఫ్రెంచ్ ఓపెన్ ఆడలేరంటూ ఫ్రాన్స్ స్పష్టం చేసింది. దీంతో జకోవిచ్ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఇటీవలే ఆస్ట్రేలియా రెండోసారి వీసా రద్దు చేయడంతో మూడేళ్ల పాటు నిషేధం కొనసాగనుంది. ఫ్రెంచ్ ఓపెన్ దూరం చేసుకోకుండా జకోవిచ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.