శ్మశానవాటికకు దారిలేక...

ABN , First Publish Date - 2021-12-02T05:45:01+05:30 IST

కంబాలపల్లి గ్రామంలో శ్మశానవాటికకు దారిలేక వాగులు, వంకలు దాటుతూ చెక్‌డ్యామ్‌ పైన నీరు పొర్లుతుండగా వృద్ధుడి శవాన్ని అతికష్టం మీద తరలించారు.

శ్మశానవాటికకు దారిలేక...
చెక్‌డ్యామ్‌ పైనే మృతదేహాన్ని మోసుకెళ్తున్న దృశ్యం

రొద్దం, డిసెంబరు 1: కంబాలపల్లి గ్రామంలో శ్మశానవాటికకు దారిలేక వాగులు, వంకలు దాటుతూ చెక్‌డ్యామ్‌ పైన నీరు పొర్లుతుండగా వృద్ధుడి శవాన్ని అతికష్టం మీద తరలించారు. బుధవారం రొద్దం మండలంలోని కంబాలపల్లిలో పెంచలమల్లయ్య(65) అనే వృద్ధుడు అనారోగ్యంతో చనిపోయాడు. అయితే వర్షాల కారణంగా శ్మశానవాటికలోకి వెళ్లేందుకు దారిలేక చెక్‌డ్యామ్‌ పైనుండి పాడిని మోసుకుంటూ వెళ్లారు. ఎన్నోఏళ్లుగా శ్మశానవాటికకు దారిలేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. హరిజనవాసును అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించి హరిజనవాసులకు శ్మశానవాటికకు దారి కల్పించాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-12-02T05:45:01+05:30 IST