
యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రధాని, యూపీ సీఎంలపై ఉ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జోడీని ఎవరూ విడదీయలేరని యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వ్యాఖ్యానించారు.35 ఏళ్ల తర్వాత బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిందని ఆమె తెలిపారు.యూపీ వాసులు సూరత్ నగరంలో స్థిరపడినా వారు యూపీ వచ్చి ఎన్నికల్లో మద్ధతు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.గుజరాత్ రాష్ట్రంలోని ఓల్పాడ్ తాలూకాలోని వడోడ్లో సమస్త్ పటీదార్ ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేసిన కిరణ్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయడానికి ఆనందీబెన్ పటేల్ సూరత్ నగరానికి వచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొన్నారు.‘‘మీ కుమార్తెలకు గర్భాశయ కేన్సర్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను’’ అని గవర్నర్ పటేల్ ప్రజలను కోరారు.
ఇవి కూడా చదవండి