రాంపూర్‌ ఉప సర్పంచ్‌పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

ABN , First Publish Date - 2022-07-01T05:48:38+05:30 IST

రాంపూర్‌ ఉప సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మాణం వీగి పోయింది. గురువారం అవిశ్వాస తీర్మానానికి సర్సాపూర్‌ ఆర్డీవో ఉపేందర్‌ రావు సమక్షంలో అవిశ్వాస తీర్మానం జరిగింది.

రాంపూర్‌ ఉప సర్పంచ్‌పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

 కొల్చారం, జూన్‌ 30: రాంపూర్‌ ఉప సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మాణం వీగి పోయింది. గురువారం అవిశ్వాస తీర్మానానికి సర్సాపూర్‌ ఆర్డీవో ఉపేందర్‌ రావు సమక్షంలో అవిశ్వాస తీర్మానం జరిగింది. ఎనిమిది మంది సభ్యులకు నలుగురు హాజరయ్యారు. ఆరుగురు సభ్యులు ఉంటేనే అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చని తెలపడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ముఖ్యంగా సర్పంచ్‌తో గత కొన్ని రోజుల నుంచి సఖ్యత లేకపోవడం అభివృద్ధి పనులపై సంతకాలు చేయలేరన్న నెపంతో తీర్మానం చేపట్టారు. కానీ సభ్యుల సంఖ్య ఆరు ఉండాలి కానీ సర్పంచ్‌తో సహా ఐదుగురు ఉండటంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. రెండు వర్గాల మధ్య కొంత సేపు తోపులాట జరిగింది. ఒక సభ్యుడు పంచాయతీ కార్యాలయం వద్దకు రాగానే మరో సభ్యుడు అతన్ని బలవంగంగా బైక్‌పై తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో ఎస్‌ఐ శ్రీనివాస్‌ గౌడ్‌ ఘటనా స్థలానికి వచ్చి బందోబస్తు నిర్వహించారు. 



Updated Date - 2022-07-01T05:48:38+05:30 IST