భారత్‌కు కశ్మీర్‌లాగే యూపీకి నోయిడా: యూపీ మంత్రి

ABN , First Publish Date - 2022-04-18T23:18:55+05:30 IST

కశ్మీర్ భూతల స్వర్గం. అది ఇండియాకు కిరీటం వంటిది. అలాగే ఉత్తరప్రదేశ్‌కు నోయిడా. ఈరోజు నోయిడాలో 108 కోట్ల రూపాయలతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాము. రాబోయే రోజుల్లో నోయిడాను మరింత గొప్పగా చూస్తాము. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు..

భారత్‌కు కశ్మీర్‌లాగే యూపీకి నోయిడా: యూపీ మంత్రి

లఖ్‌నవూ: భారతదేశానికి కశ్మీర్ ఎంతటి తలమానికమో ఉత్తరప్రదేశ్‌కు నోయిడా అంతటి తలమానికమేనని ఆ రాష్ట్ర మంత్రి నంద్ గోపాల్ గుప్త అన్నారు. సోమవారం న్యూ ఓక్లా ఇండియస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (నోయిడా) 46వ సంస్థాపనా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ యూపీలో నోయిడా అత్యంత కీలకమైందని అన్నారు. ఇదే వేదిక నుంచి నోయిడాలో 100 కోట్ల రూపాయల ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.


‘‘కశ్మీర్ భూతల స్వర్గం. అది ఇండియాకు కిరీటం వంటిది. అలాగే ఉత్తరప్రదేశ్‌కు నోయిడా. ఈరోజు నోయిడాలో 108 కోట్ల రూపాయలతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాము. రాబోయే రోజుల్లో నోయిడాను మరింత గొప్పగా చూస్తాము. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఇక్కడ పెట్టుబడుటు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వ్యాపారస్తులకు అనువైన వాతావరణాన్ని, సౌలభ్యాన్ని యోగి ప్రభుత్వం కల్పించింది’’ అని మంత్రి గోపాల్ గుప్త అన్నారు.

Updated Date - 2022-04-18T23:18:55+05:30 IST