delhi:కాలుష్యాన్ని అరికట్టేందుకు గూడ్స్ వాహనాల ప్రవేశంపై నిషేధం

ABN , First Publish Date - 2021-11-18T14:40:57+05:30 IST

వాయు కాలుష్యం నివారణకు ట్రాఫిక్ పోలీసులు ఢిల్లీలోకి భారీ, మధ్యతరగతి గూడ్స్ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు...

delhi:కాలుష్యాన్ని అరికట్టేందుకు గూడ్స్ వాహనాల ప్రవేశంపై నిషేధం

ఢిల్లీ : వాయు కాలుష్యం నివారణకు  ట్రాఫిక్ పోలీసులు ఢిల్లీలోకి భారీ, మధ్యతరగతి గూడ్స్ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. ఢిల్లీలో గురువారం ఉదయం 6.30 గంటలకు వాయు కాలుష్యం ఏక్యూఐ 362గా నమోదైంది. వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను పూర్తిగా మూసివేయడం, ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించడం, దేశ రాజధానికి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆరు థర్మల్ పవర్ ప్లాంట్‌లను మూసివేయాలని నిర్ణయించారు.ఢిల్లీ,నోయిడా పరిధిలోని చిల్లా, డిఎన్‌డి, కాళింది కుంజ్, అశోక్ నగర్, జందూపురా సరిహద్దుల మీదుగా వివిధ ప్రాంతాలకు భారీ, మధ్యస్థ సరకు రవాణా వాహనాలను దారి మళ్లించారు. ఢిల్లీలో వాయుకాలుష్యం కొనసాగుతున్నందున అన్నిరకాల చర్యలతో ఆదివారం నాటికల్లా తగ్గించాలని నిర్ణయించారు.


Updated Date - 2021-11-18T14:40:57+05:30 IST