Viral: పసిబిడ్డను గుండెలకు కట్టుకుని ఆటో నడుపుతున్న మహిళ.. ఆమె కథ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-09-26T02:33:26+05:30 IST

ఆ మహిళ మూడేళ్ల క్రితం ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఎన్నో ఆశలతో అత్తింట అడుగు పెట్టిన ఆమెకు భర్త రూపంలో నరకం ఎదురైంది.

Viral: పసిబిడ్డను గుండెలకు కట్టుకుని ఆటో నడుపుతున్న మహిళ.. ఆమె కథ ఏంటంటే..

ఆ మహిళ మూడేళ్ల క్రితం ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఎన్నో ఆశలతో అత్తింట అడుగు పెట్టిన ఆమెకు భర్త రూపంలో నరకం ఎదురైంది. భర్త ఆమెను చిత్రహింసలకు గురి చేసేవాడు. పెళ్లి జరిగిన ఏడాదికి ఆమె తల్లైంది. అయినా ఆమె కష్టాలు తగ్గలేదు. భర్త వేధింపులను తట్టుకోలేక పుట్టింటికి వెళ్లింది. పుట్టింటి వారి పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో ఆమె తన కాళ్ల  మీద తాను నిలబడాలనుకుంది. ఒక ఈ-రిక్షా అద్దెకు తీసుకుని నడుపుతోంది. తన బిడ్డను చున్నీ సహాయంతో గుండెలకు అదుముకుని బతుకు పోరాటం సాగిస్తోంది.  


ఇది కూడా చదవండి..

Anand Mahindra: ఈ మ్యారేజ్ హాల్ ఐడియా అదుర్స్.. ఆసక్తికర వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా


నోయిడా (Noida)కు చెందిన చంచల్‌ శర్మ  అనే మహిళ 2019లో దాద్రీకి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. కొద్ది రోజులు కూడా అతను చంచల్‌ను బాగా చూసుకోలేదు. ఎప్పుడూ భార్యను హింసిస్తూనే ఉండేవాడు. కొడుకు పుట్టిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. భర్త వేధింపులను తట్టుకోలేక చంచల్ పుట్టింటికి చేరుకుంది. అయితే తండ్రి లేని కుటుంబం కావడంతో వారి ఆర్థిక  పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. వారికి భారం కాకూడదని తన కాళ్ల మీద తాను నిలబడాలని చంచల్ నిర్ణయించుకుంది. ఓ ఈ-రిక్షాను అద్దెకు తీసుకుంది. తన చిన్నారిను చున్నీతో గుండెలకు కట్టుకుని ఆటో నడుపుతూ జీవనం సాగిస్తోంది. 


ఈ-రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న చంచల్‌కు మొదట్లో స్థానిక ఈ-రిక్షా డ్రైవర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అందరూ కలిసి ఆమెకు ఆటంకాలు కలిగించారు. ఆమెకు ఈ-రిక్షా అద్దెకు ఇవ్వకూడదని గొడవ చేశారు. అయితే చంచల్ ట్రాఫిక్‌ పోలీసుల సహాయంతో ఆ సమస్యలను అధిగమించింది. ఉదయం ఆరున్నరకు సెక్టార్‌-62 లోని మెట్రో ఎలక్ట్రానిక్‌ సిటీకి వెళ్లి రోజుకు రూ.300 అద్దెకు ఆటో తీసుకుంటుంది. రోజంతా నడిపి అద్దె పోను రూ.600 నుంచి 700 వరకూ సంపాదిస్తోంది. 

Updated Date - 2022-09-26T02:33:26+05:30 IST