తొలగిన సందిగ్ధత.. ప్రవాసులకు గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2022-02-19T15:34:05+05:30 IST

కరోనా విజృంభణ నేపథ్యంలో దాదాపు అన్ని దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కువైత్ కూడా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేసింది. అయితే మహమ్మారి ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను సడలించింది..

తొలగిన సందిగ్ధత.. ప్రవాసులకు గుడ్‌న్యూస్

ఎన్నారై డెస్క్: కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని విదేశీయులను తమ దేశంలోకి అనుమతి ఇచ్చే విషయంలో కువైత్ స్పష్టత ఇచ్చింది. కరోనా టీకా తీసుకోని వాళ్లు సైతం కువైత్‌లోకి ఎంటర్ అయ్యేందుకు వీలు కల్పించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



కరోనా విజృంభణ నేపథ్యంలో దాదాపు అన్ని దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కువైత్ కూడా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేసింది. అయితే మహమ్మారి ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను సడలించింది. కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోని వాళ్లను కూడా తమ దేశంలోకి అనుమతిచ్చింది. దీంతో భారత్‌లోని ప్రవాసులు ఊపిరి పీల్చుకున్నారు. కోవాగ్జిన్ తీసుకున్నప్పటికీ దాన్ని కువైత్ గుర్తించకపోవడంతో భారత్‌లోనే ఉండిపోయిన ప్రవాసులు కువైత్ వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. ఇంతలో.. ప్రవాసులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాకిచ్చింది. తమ దేశ పౌరులను మాత్రమే వ్యాక్సిన్ తీసుకోనప్పటికీ కువైత్‌లోకి అనుమతిస్తున్నట్టు వెల్లడిస్తూ గురువారం ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రవాసులు గందరగోళానికి గురయ్యారు. అయితే తాజాగా శుక్రవారం డీజీసీఏ మరో ప్రకటన విడుదల చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని విదేశీయులను సైతం తమ దేశంలోకి అనుమతిస్తున్నట్టు అందులో స్పష్టం చేసింది. కానీ.. ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను పొందాలని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రవాసులకు భారీ ఉపశమనం లభించింది. సందిగ్ధత తొలగడంతో ప్రయాణానికి సిద్ధం అవుతున్నారు. 




Updated Date - 2022-02-19T15:34:05+05:30 IST