ఇద్దరు ఐఏఎ‌స్‌లపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ABN , First Publish Date - 2021-03-06T09:39:02+05:30 IST

కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ఐఏఎస్‌ అధికారులు బి.రామారావు, కె.ప్రవీణ్‌కుమార్‌ అరె్‌స్టకు హైకోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈనెల 19లోపు వారిని కోర్టు

ఇద్దరు ఐఏఎ‌స్‌లపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో హైకోర్టు ఉత్తర్వు

  

అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ఐఏఎస్‌ అధికారులు బి.రామారావు, కె.ప్రవీణ్‌కుమార్‌ అరె్‌స్టకు హైకోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈనెల 19లోపు వారిని కోర్టు ముందు హాజరుపర్చాలని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌, గుం టూరు ఎస్పీలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం ఆదేశాలిచ్చారు. విజయనగరం జిల్లా పరిధిలోని బాలుర వసతి గృహం ఉద్యోగి జి.చంద్రమౌళికి హెచ్‌డబ్ల్యూఓ గ్రేడ్‌-1గా పదోన్నతి ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అవి అమలు కాకపోవడంతో చంద్రమౌళి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిబ్రవరి 5న విచారణ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బి.రామారావు, ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్‌ తదుపరి విచారణ నాటికి హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే విచారణకు హాజరు కాకపోవడానికి కారణాలు చూపుతూ వారు హాజరు మినహాయింపు పిటిష న్‌ వేశారు. వాటిని కొట్టివేసిన న్యాయమూర్తి నా ల్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. వ్యా జ్యంలో ప్రతివాదులుగా ఉన్న విజయనగరం జి ల్లా కలెక్టర్‌ హరిజవహర్‌ లాల్‌, బీసీ సంక్షేమ అ ధికారి డి.కీర్తి తదుపరి విచారణకు ఏప్రిల్‌ 6న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. 

Updated Date - 2021-03-06T09:39:02+05:30 IST