సాధారణ ప్రసవాలు పెంచాలి

ABN , First Publish Date - 2022-08-17T04:19:27+05:30 IST

జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు సాధారణ ప్రసవాలు పెంచాలని డీఎంహెచ్‌వో ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

సాధారణ ప్రసవాలు పెంచాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో ప్రభాకర్‌రెడ్డి

- డీఎంహెచ్‌వో ప్రభాకర్‌రెడ్డి

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆగస్టు 16: జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు సాధారణ ప్రసవాలు పెంచాలని డీఎంహెచ్‌వో ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిజేరిన్ల శాతం తగ్గించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బర్త్‌ మానిటరింగ్‌ సిస్టం పోర్టల్‌ను ప్రారంభించిందని చెప్పారు. ఈ పోర్టల్‌లో ప్రైవేటు ఆసుపత్రులు ప్రతి డెలవరీని నమోదు చేయాలన్నారు. ఆయూష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌లో ప్రతీ ప్రైవేటు ఆసుపత్రి తమ ఆధార్‌, మొబైల్‌ నెంబర్‌తో నమోదు చే యించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎం హెచ్‌ సుధాకర్‌నాక్‌, డిప్యూటీ డెమో నాగలక్ష్మి, డీడీఎం శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

కాగజ్‌నగర్‌ టౌన్‌: కాగజ్‌నగర్‌ పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో ప్రభాకర్‌ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, ఇతరా అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్‌ సీతారాం, డాక్టర్‌ మంజుల తదితరులున్నారు. అనంతరం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో బుధవారం నిర్వహించే రక్తదాన శిబిరం ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు.

Updated Date - 2022-08-17T04:19:27+05:30 IST