సాధారణ ప్రసవాలు పెంచాలి

ABN , First Publish Date - 2022-05-26T05:48:09+05:30 IST

అసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచాలని, అపరేషన్‌ ప్రసవాలను తగ్గించాలని వైద్య అరోగ్య, మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి శ్రీనివాసరావు అన్నారు.

సాధారణ ప్రసవాలు పెంచాలి
మాట్లాడుతున్న శ్రీనివాసరావు

- వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు 

సిరిసిల్ల, మే 25 (ఆంధ్రజ్యోతి): అసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచాలని, అపరేషన్‌ ప్రసవాలను తగ్గించాలని వైద్య అరోగ్య, మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో హెల్త్‌ ప్రొపైల్‌, జాతీయ అరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక అరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలను పెంచాలని అన్నారు. మెడికల్‌ కాలేజీలు కూడా జిల్లాలో ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. ప్రసవాలకు సంబంధిచి ప్రొత్సహాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. హెల్త్‌ ప్రొపైల్‌ గురించి వివరాఉల తెలుసుకోని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, అరు, ఏడు రోజుల్లోనే పూర్తి కావాలని అన్నారు. గర్భవతుల నమోదు, సంక్రమిత వ్యాధులు, అసంక్రమిత వ్యాధులపై సమీక్షించారు. సమావేశంలో జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బాలాజీ రెడ్డి, డాక్డర్‌ విజయ్‌కుమార్‌, పోగ్రాం అధికారి డాక్టర్‌ కృష్ణ, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, డాక్టర్‌ శ్రీరాములు, డాక్టర్‌ మహేష్‌, డాక్టర్‌ రజిత, డాక్టర్‌ మీనాక్షి, డాక్టర్‌ కపిలసాయి, రాజ్‌కుమార్‌, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T05:48:09+05:30 IST