
ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రైతుబంద్’ సినిమా టైటిల్ ‘రైతన్న’గా మారింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్య క్రమాలు జరగుతున్నాయి. ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నారాయణమూర్తి మాట్లాడుతూ ‘‘రైతులకు మేలు జరుగుతుందని కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ‘ఆ చట్టాలు మాకు ఉరితాళ్లు’ అని ఉత్తరాది రాష్ట్రాల రైతులు ఢిల్లీలో పెద్ద ఉద్యమం చేస్తున్నారు. ఈ చట్టాల వల్ల వ్యవసాయం అంతా కార్పొరేట్ మయం అయిపోతుంది. మార్కెట్ యార్డుల వ్యవస్థ పోయి రైతులు నష్టపోతారు. వ్యవసాయం కూడా ప్రైవేట్ పరం అయితే ఈ దేశం ఎక్కడకు పోతుంది? ఈ మూడు చట్టాలను రద్దు చేయాలని ‘రైతన్న’ చిత్రం ద్వారా కోరుతున్నాను అని నారాయణమూర్తి అన్నారు.