ఇక మా వల్ల కాదు

ABN , First Publish Date - 2021-06-17T05:13:24+05:30 IST

ధాన్యం తర లింపులో లారీల అద్దె, హమాలీల ఖర్చును తాము భరించలేమని రైతులు బుధవారం నారాయణపే ట జిల్లా కేంద్రంలోని కొత్త గంజ్‌ ముందు గల ప్ర ధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.

ఇక మా వల్ల కాదు
నారాయణపేటలో రాస్తారోకో చేస్తున్న రైతులు

- ధాన్యం భూత్పూర్‌ మిల్లుకు తరలించాలంటున్న అఽధికారులు

- లారీల అద్దె, హమాలీల ఖర్చు భరించలేమని రైతుల రాస్తారోకో


నారాయణపేట టౌన్‌, జూన్‌ 16 : ధాన్యం తర లింపులో లారీల అద్దె, హమాలీల ఖర్చును తాము భరించలేమని రైతులు బుధవారం నారాయణపే ట జిల్లా కేంద్రంలోని కొత్త గంజ్‌ ముందు గల ప్ర ధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సం దర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పక్షం రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ఉండి ధాన్యం విక్రయించేందుకు పడిగాపులు కాస్తూ, ధాన్యం అటు ఇటు తరలిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని వాపోయారు. మళ్లీ ఈ ధాన్యాన్ని మహ బూబ్‌నగర్‌లోని భూత్పూర్‌ రైసు మిల్లుకు తరలిం చాలని అధికారులు చెబుతున్నారని, లారీల అద్దె, హమాలీల ఖర్చును తాము భరించలేమని వాపో యారు. ఇప్పటికే ధాన్యం వద్ద పడిగాపులు కాస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పు డేమో ఇక్కడి నుంచి ధాన్యాన్ని భూత్పూర్‌ మిల్లు కు తరలించాలని చెబుతుండటంతో ఈ ఖర్చులు ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. ఖర్చులు భరించ డం ఇక మా వల్ల కాదని అసహనం వ్యక్తం చేశా రు. సీఐ శ్రీకాంత్‌రెడ్డి రైతుల సమస్యలను ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికా రులు ధాన్యాన్ని తరలించేందుకు లారీలను పంపి స్తామని చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు.

Updated Date - 2021-06-17T05:13:24+05:30 IST