బలపరీక్ష డిమాండ్ చేయలేదు: రాజస్తాన్ కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-07-14T17:33:04+05:30 IST

అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెబల్ నేత సచిన్ పైలెట్ అన్నారు. ఇది బీజేపీకి కూడా కలిసి వచ్చే అంశం. సచిన్ చెబుతున్నట్లు ఆయన వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలు ఉండి వారంతా ప్రభుత్వానికి

బలపరీక్ష డిమాండ్ చేయలేదు: రాజస్తాన్ కాంగ్రెస్

జైపూర్: రాజస్తాన్ ప్రభుత్వంపై తాము బలపరీక్షకు ఇప్పటికీ డిమాండ్ చేయలేదని రాజస్తాన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సతీష్ పునియా స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు కారణం బీజేపీయేనని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. తమ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికీ 30 కోట్ల రూపాయల చొప్పున బీజేపీ ఆఫర్ చేస్తోందని, కాంగ్రెస్ నేతల్ని అంగట్లో నిలబెట్టాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.


కాగా, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెబల్ నేత సచిన్ పైలెట్ వ్యాఖ్యానించారు. ఇది బీజేపీకి కూడా కలిసి వచ్చే అంశం. సచిన్ చెబుతున్నట్లు ఆయన వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలు ఉండి వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారితే బీజేపీ అధికారంలో రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే విషయమై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సతీష్ పునియా మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ కలహాల్లో మేం జోక్యం చేసుకోము. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందనే ఆరోపణలు అవాస్తవం. మేం ఇప్పటి వరకు ప్రభుత్వంపై బలపరీక్షకు డిమాండ్ చేయలేదు’’ అని అన్నారు.

Updated Date - 2020-07-14T17:33:04+05:30 IST