టాలీవుడ్‌లో కాదు బాలీవుడ్‌లో...

Jun 16 2021 @ 01:47AM

నాగచైతన్య త్వరలోనే సెట్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే అది తను కథానాయకుడిగా నటిస్తున్న ‘థాంక్యూ’ చిత్రంకోసం కాదు. ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘లాల్‌సింగ్‌ చద్దా’తో నాగచైతన్య హిందీ చిత్రసీమకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అడుగుపెట్టబోయేది ఈ చిత్రం సెట్‌లోకే. ‘లాల్‌సింగ్‌చద్దా’లో నాగచైతన్య కీలకపాత్రలో నటిస్తున్నారు. కరోనా రెండో దశతో నిలిచిపోయిన చిత్రీకరణ ఇటీవల ముంబైలో ప్రారంభమైంది. ఆమిర్‌ఖాన్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌ను కార్గిల్‌లో ప్రారంభించేందుక సన్నాహాలు చేస్తున్నారు. నాగచైతన్య కూడా చిత్రీకరణలో పాల్గొంటారని, తేదీలను కూడా ఖరారు చేశారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ‘లవ్‌స్టోరీ’ చిత్రం ఇప్పటికే విడుదలకు సిద్ధమవగా ‘థాంక్యూ’ చిత్రీకరణకు కరోనా రెండో దశ బ్రేక్‌ వేసింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.