FIR లో పేరు లేకపోయినా నా ఇంట్లో సోదాలు: చిదంబరం

ABN , First Publish Date - 2022-05-17T19:53:32+05:30 IST

కార్తీ చిదంబరంపై కొనసాగుతున్న కేసుకు సంబంధించి ఏడు ప్రాంగణాల్లో మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, తమిళనాడులోని శివగంగైలోని పలు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. 2010-14 మధ్య కాలంలో..

FIR లో పేరు లేకపోయినా నా ఇంట్లో సోదాలు: చిదంబరం

న్యూఢిల్లీ: FIR లో తన పేరు లేకపోయినా Central Bureau of Investigation (సీబీఐ) అధికారులు తన ఇంట్లో సోదాలు నిర్వహించారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. మంగళవారం ఆయన, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇళ్లపై సీబీఐ సోదాలు నిర్వహించింది. అనంతరం ట్విట్టర్ ద్వారా చిదంబరం స్పందిస్తూ ‘‘ఈరోజు ఉదయం, చెన్నైలోని నా నివాసంలో ఢిల్లీలోని నా అధికారిక నివాసంలో సీబీఐ టీం సోదాలు నిర్వహించింది. సీబీఐ అధికారులు నాకు ఒక ఎఐఆర్ కాపీని చూపించారు. అయితే అందులో నేను నిందితుడని అందులో లేదు. వచ్చారు.. సోదా చేశారు. వాల్లకి ఏమీ దొరకలేదు. వాళ్లేమీ సీజ్ చేయలేదు. అయితే ఒకటైతే నేను గమనించారు. వాళ్లు సోదాలు చేస్తున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది’’ అనే అర్థంలో ట్వీట్ చేశారు.


కార్తీ చిదంబరంపై కొనసాగుతున్న కేసుకు సంబంధించి ఏడు ప్రాంగణాల్లో మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, తమిళనాడులోని శివగంగైలోని పలు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. 2010-14 మధ్య కాలంలో విదేశీ రెమిటెన్స్‌ల ఆరోపణలపై కార్తీ చిదంబరంపై దర్యాప్తు సంస్థ తాజా కేసు నమోదు చేసింది. కార్తీ చిదంబరం తన తండ్రి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రూ.305 కోట్ల మేర విదేశీ నిధులను స్వీకరించినందుకు ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ క్లియరెన్స్‌కు సంబంధించిన కేసుతో సహా పలు కేసుల్లో విచారణ జరుగుతోంది.

Updated Date - 2022-05-17T19:53:32+05:30 IST