
మొయినాబాద్: మచ్చలేని తనపై ఆరోపణలు సరికాదని బీజేపీ నేత జితేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తినని చెప్పారు. ఢిల్లీలో ఉన్న సమయాల్లో పాలమూరు నుంచి వచ్చే ప్రతి ఉద్యమకారుడికి ఆశ్రయమిస్తుంటానని, కేసీఆర్ లాగా ఉద్యమద్రోహులను పక్కన చేరదీసుకునే వ్యక్తిని కాదని అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యకు కుట్ర కేసులో బీజేపీ నేతలపై ఆరోపణలు, తన ఇంటిపై దాడులను ఆయన ఖండించారు. తెలంగాణ ఉద్యమకారులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. గతనెల 26వ తేదీన టీఆర్ఎస్ నాయకుడు మున్నూరు రవి వ్యక్తిగత పనిమీద ఢిల్లీకి వస్తే పీఏ ద్వారా వసతి కోరితే వసతి కల్పించానని, అతడు తిరిగి 28వ తేదీన వెళ్లిపోయాడని జితేందర్‌రెడ్డి తెలిపారు.