స్పుత్నిక్‌ వీ ధరపై తుది నిర్ణయం తీసుకోలేదు: డాక్టర్‌ రెడ్డీస్‌

ABN , First Publish Date - 2021-04-23T08:12:28+05:30 IST

భారత్‌లో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ధర ను ఇంకా నిర్ణయించలేదని, దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని డాక్టర్‌ రెడ్డీస్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది...

స్పుత్నిక్‌ వీ ధరపై తుది నిర్ణయం తీసుకోలేదు: డాక్టర్‌ రెడ్డీస్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: భారత్‌లో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ధర ను ఇంకా నిర్ణయించలేదని, దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని డాక్టర్‌ రెడ్డీస్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ అత్యవసర వినియోగానికి భారత్‌ ఇటీవలే అనుమతి ఇచ్చింది. దేశంలో ఆ వ్యాక్సిన్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్స్‌ అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని ధర ఒక్కో డోసుకు రూ.750 ఉండే అవకాశం ఉందని బుధవారం డాక్టర్‌ రెడ్డీస్‌ ఎండీజీవీ ప్రసాద్‌ చెప్పారు. అయితే, ప్రపంచ మార్కెట్‌లో దాని ధర దాదాపు అంతే ఉందని, దిగుమతుల ద్వారా భారత్‌లో త్వరలో అందించాలనుకుంటున్న ఆ వ్యాక్సిన్‌ ధరపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని గురువారం డాక్టర్‌ రెడ్డీస్‌ చెప్పడం గమనార్హం. తుది నిర్ణయం తీసుకున్నాక తాము ధరపై ప్రకటన చేస్తామని స్పష్టం చేసింది.

Updated Date - 2021-04-23T08:12:28+05:30 IST