కొత్త XE వేరియంట్ గురించి భయపడొద్దు...ఎన్‌టిఎజిఐ చీఫ్ వెల్లడి

ABN , First Publish Date - 2022-04-11T18:44:28+05:30 IST

కొవిడ్ ఎక్స్ఈ వేరియంట్ కేసుల గురించి భయపడొద్దని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టిఎజిఐ) చీఫ్ ఎన్‌కె అరోరా స్పష్టం చేశారు....

కొత్త XE వేరియంట్ గురించి భయపడొద్దు...ఎన్‌టిఎజిఐ చీఫ్ వెల్లడి

న్యూఢిల్లీ:  కొవిడ్ ఎక్స్ఈ వేరియంట్ కేసుల గురించి భయపడొద్దని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టిఎజిఐ) చీఫ్ ఎన్‌కె అరోరా స్పష్టం చేశారు. ఎక్స్ఈ సిరీస్‌లోని ఒమైక్రాన్ వేరియంట్‌లు తీవ్రమైన వ్యాధిని కలిగించవని అరోరా తెలిపారు.దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఎక్స్ఈ వేరియంట్ రెండు కేసులు నమోదైన నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్ కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం సోమవారం తెలిపింది. భారతీయ డేటా ప్రకారం ఎక్స్ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం లేదని అరోరా చెప్పారు.‘‘ఒమైక్రాన్ పలు కొత్త వేరియంట్‌లను అందిస్తుందని, ఈ వేరియంట్‌ల గురించి భయపడాల్సిన పనిలేదు’’అని ఆయన స్పష్టం చేశారు. 


మహారాష్ట్రలోని ముంబైలో ఒమైక్రాన్ సబ్-వేరియంట్ ఎక్స్ఈ కేసు బయటపడింది. టీకాలు వేయించుకున్న 67 ఏళ్ల వ్యక్తికి వేరియంట్‌ సోకినట్లు గుర్తించినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు. మరో వైపు గుజరాత్‌లో ఒక రోగికి కరోనావైరస్ ఎక్స్ఈ వేరియంట్ సోకింది.


Updated Date - 2022-04-11T18:44:28+05:30 IST