సాక్షాత్తూ Chief Ministerకే నాణ్యత లేని టిఫిన్... food supply officerకు నోటీసు

ABN , First Publish Date - 2022-07-13T14:36:17+05:30 IST

సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి నాణ్యత లేని అల్పాహారాన్ని పెట్టారనే కోపంతో ఓ జూనియర్ ఫుడ్ సప్లయి ఆఫీసరుకు షోకాజ్ నోటీసు జారీ చేసిన ఘటన...

సాక్షాత్తూ Chief Ministerకే నాణ్యత లేని టిఫిన్... food supply officerకు నోటీసు

సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో నోటీసు ఉపసంహరణ

భోపాల్(మధ్యప్రదేశ్): సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి నాణ్యత లేని అల్పాహారాన్ని పెట్టారనే కోపంతో ఓ జూనియర్ ఫుడ్ సప్లయి ఆఫీసరుకు షోకాజ్ నోటీసు జారీ చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. సోమవారం ఖజురహో విమానాశ్రయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కోల్డ్ టీ, నాసిరకం అల్పాహారం పెట్టారని జూనియర్ ఫుడ్ సప్లై ఆఫీసర్‌కు జారీ చేసిన షోకాజ్ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అయింది.జూనియర్ ఫుడ్ సప్లై ఆఫీసర్‌కు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ద్వివేది షోకాజ్ నోటీసు జారీ చేశారు. ‘‘ఖజురహో జిల్లా యంత్రాంగం అసభ్య ప్రవర్తన సీఎం ప్రోటోకాల్ నిర్వహణపై ప్రశ్నార్థకమైంది.


 వీవీఐపీ సేవలను సాధారణంగా తీసుకోవడం వల్ల ఇది జరిగింది.’’ అని మేజిస్ట్రేట్ చెప్పారు. షోకాజ్ నోటీసు జారీపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో ఛతర్‌పూర్ జిల్లా కలెక్టర్ సందీప్ జి.ఆర్. ద్వివేది ఇచ్చిన నోటీసును రద్దు చేశారు.ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదని, అందువల్ల జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకున్నామని సందీప్ చెప్పారు. టీపై  సీఎం ఫిర్యాదు చేసే అవకాశం లేదని బీజేపీ మీడియా ఇంచార్జి వివరణ ఇచ్చారు.ఇలాంటి చర్యలను సహించలేమని నోటీసు జారీ చేసిన అధికారి అర్థం చేసుకోవాలని, సింప్లిసిటీని ఇష్టపడే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ టీపై ఫిర్యాదు చేయరని రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ లోకేంద్ర పరాసర్ అన్నారు.


‘‘ముఖ్యమంత్రికి నాసిరకం అల్పాహారం వడ్డించారని మాకు తెలిసింది. ఆయనకు అందించే టీ చల్లగా ఉంది, జిల్లా యంత్రాంగం యొక్క అసభ్య ప్రవర్తన సిఎం ప్రోటోకాల్ నిర్వహణపై ప్రశ్నార్థకమైంది.మీపై ఎందుకు క్రమశిక్షణా చర్య తీసుకోకూడదు. నోటీసు అందుకున్న మూడు రోజుల్లోగా మీ ప్రత్యుత్తరాన్ని సమర్పించంది’’ అని  షోకాజ్ నోటీసులో మెజిస్ట్రేట్ పేర్కొన్నారు.




Updated Date - 2022-07-13T14:36:17+05:30 IST