నెలైనా.. నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2021-10-07T05:10:20+05:30 IST

జిల్లాలో దాదాపు 40కిపైగా ఇంజ నీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో వివిధ బ్రాంచీల్లో దాదాపు 20వేలపైన సీట్లు ఉన్నాయి.

నెలైనా.. నోటిఫికేషన్‌
సర్టిఫికెట్ల పరిశీలన (పాతచిత్రం)

ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో ఆందోళన

ఈఏపీసెట్‌పై కొనసాగుతోన్న సందిగ్ధత

డీమ్డ్‌, ప్రైవేటు వర్సిటీల వైపు విద్యార్థుల చూపు

సీట్లు భర్తీపై కళాశాలల  యాజమాన్యాల్లో ఆందోళన


ఈఏపీసెట్‌ (ఎం సెట్‌) ఫలితాలు విడుదలై నెల రోజు లు అవుతుంది. అయినా ఇంకా కౌన్సెలింగ్‌కు సం బంధించి ప్రభు త్వం నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. ఇతర రాష్ట్రాలు, ప్రైవేటు వర్సిటీల్లో కౌన్సెలింగ్‌లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో నోటిఫికేషన్‌పై నెలకొన్న సంది గ్ధతతో స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలల్లో చేరా లనుకునే విద్యార్థుల్లో ఆందో ళన నెలకొంది. మరోవైపు విద్యార్థులు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా డీమ్డ్‌, ప్రైవేటు యూని వర్సిటీల్లో సీట్లు కోసం ఆరా తీస్తున్నారు. ఈ      పరిణామంతో సీట్ల భర్తీపై జిల్లాలోని ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది.


గుంటూరు(విద్య), అక్టోబరు 6:   జిల్లాలో దాదాపు 40కిపైగా ఇంజ నీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో  వివిధ బ్రాంచీల్లో దాదాపు 20వేలపైన సీట్లు ఉన్నాయి. ఈఏ పీసెట్‌లో అర్హత సాధించిన వారికంటే జిల్లాలో సీట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినా ఇక్కడ నోటిఫికేషన్‌ విడుదల ఎప్పుడనే అంశం తేలలేదు. దీంతో జిల్లాలో ఈఏపీసెట్‌లో అర్హ త సాధించి ఓ మోస్తారు ర్యాంకు వచ్చిన వారు డీమ్డ్‌, ప్రైవేటు వర్సిటీల వైపు మొగ్గు చూపుతు న్నారు. ఇప్పటికే కొంతమంది తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో సీట్లు రిజర్వు చేసుకు న్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సకాలంలో నోటి ఫికేషన్‌ జారీ చేయకుంటే సీట్ల భర్తీ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఫలితాలు విడుదలై దా దాపు నెల రోజులు కావస్తున్నా నోటిఫికేషన్‌ విడు దలపై ప్రభుత్వం  స్పందించడం లేదని యాజ మాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీల్లో 30శాతం సీట్లు ఈఏపీసెట్‌ అర్హత ఉన్న విద్యార్థులకు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.  దీంతో ఆయా సీట్లకు విద్యార్థులు ఎంత ఫీజు చెల్లించాలనేది ఖరారు కాలేదు. వాస్త వానికి పాలిసెట్‌ కంటేముందే ఎంసెట్‌  అంటే  గతనెల 18న నోటిఫికేషన్‌ జారీ అవుతుందని యాజ మాన్యాలు భావించాయి. అయితే నోటిఫికేషన్‌ మాత్రం జారీ కాలేదు. తాజాగా ఈ నెల 1న  పాలి సెట్‌ నోటిఫకేషన్‌ జారీ చేశారు. ఈ నెల 15 తరువాత ఎంసెట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉందని ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ నెల 15 తరువాత కూడా నోటిఫికేషన్‌ జారీకాకపోతే విద్యార్థులు ఎక్కువ మంది  డీమ్డ్‌, ప్రైవేటు యూనివర్సిటీల్లో చేరే అవకాశం ఉంది.     ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్‌ జారీ చేసేలా విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరే అంశంపై రెండు రోజుల్లో విజయవాడలో ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ సమావేశం నిర్వహిం చనున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-10-07T05:10:20+05:30 IST