యూత్‌లో జోష్‌

ABN , First Publish Date - 2022-03-10T05:46:22+05:30 IST

యూత్‌లో జోష్‌

యూత్‌లో జోష్‌

భారీగా ఉద్యోగాల ప్రకటన చేసిన ప్రభుత్వం

 95 శాతం పోస్టులు స్థానికులకే...

 భూపాలపల్లి జిల్లాలో 918,   ములుగు జిల్లాలో 696 

 కాళేశ్వరం జోన్‌లో 1,630, మల్టీ జోన్‌-1లో 6,800 

 రెండు జిల్లాల్లో 10,044 ఉద్యోగాలు

 స్వరాష్ట్రంలో తొలిసారిగా గ్రూపు-1 పోస్టులు

 వయస్సు సడలింప ుపై భిన్నాభిప్రాయాలు

 జిల్లా కేడర్‌ పోస్టులపై నిరుద్యోగుల్లో ఆశలు

భూపాలపల్లి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : నిరుద్యోగు ల ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటన వారిలో జోష్‌ నింపింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పెద్దగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవటంతో నిరాశగా ఉన్న యువత కు ఊరట కలిగింది. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటా యిస్తామని చెప్పడం మరింత ఉత్సాహం కలిగి స్తోంది. స్వరాష్ట్రంలో తొలిసారిగా గ్రూపు-1 పోస్టులను భర్తీ చేయనుండటం పట్ల వెనుకబడిన ప్రాంతాలైన భూపా లపల్లి, ములుగు జిల్లాల నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమ వుతోంది. అయితే.. ఉద్యోగాల కోసం  వయ సు సడలింపు చేయటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. 

లోకల్‌ కోటా 95 శాతం..

కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వం నూతన జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీంతోపాటు స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 95శా తం కోటాను కేటాయించింది.  గతంలో రాష్ట్రపతి ఉత్త ర్వుల ప్రకారం జిల్లా కేడర్‌ పోస్టులు 60 నుంచి 80 శాతం వరకు ఉండేవి. ప్రస్తుతం 95 శా తం ఉద్యోగాలు ఆయా జిల్లా వాసులకే ప్రభుత్వం కేటాయించింది. ఓపెన్‌ కోటా లో ఐదు శాతం ఉద్యోగాలు మాత్రమే కేటాయించారు. దీంతో 95 శాతం ఉద్యోగాలు సొంత జిల్లాలోనే లభిస్తుం డటంతో పూర్తిగా వెనుబడిన భూపాల పల్లి, ములుగు జిల్లాల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాగా ఉన్నప్పుడు జిల్లా కేడర్‌ పోస్టు లన్నీ పట్టణల్లో చదివినవారికి, ఆర్థికంగా ఉండి, కోచిం గులకు వెళ్లే వారితో పాటు హనుమకొండ, వరంగల్‌ నగరాలకు చెందిన వారికే అధికంగా ఉద్యోగాలు లభించేవనే అభిప్రాయాలు ఉన్నాయి. కొత్త విధానంతో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోనే ఉద్యోగావకాశాలు ఉండటంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

పోస్టులు ఇలా.. 

జిల్లా స్థాయిలో అధికంగా పోస్టులు ఖాళీలు ఉండటంతో నిరుద్యోగులు ఏళ్లనాటి కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా స్థాయి ఉద్యోగాలపై యువత దృష్టిపెట్టింది. ప్రధానంగా ఉపా ధ్యాయ పోస్టుల భర్తీకి కొన్ని ఏళ్లుగా నోటీఫికేషన్లు లేక బీఎడ్‌, డీఎడ్‌ చేసిన వారు ఆశతో ఎదురుచూస్తున్నా రు. ఉద్యోగ నియామకాల్లో భాగంగా కొత్త జిల్లాలు, మండలాలతో ఏర్పడిన ఖాళీలను కూడా ప్రభుత్వం భర్తీ చేయనుంది. భూపాలపల్లి జిల్లాల్లో 918 పోస్టు లు, ములుగు జిల్లాలో 696 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. ఇవన్నీ జిల్లా స్థాయి పోస్టులే. రెండు జిల్లాల్లో 1,614 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాన్‌ గెజిటెడ్‌ పోస్టులన్నీ జిల్లా కేడర్‌ కింద గుర్తించారు. దీంతో ఉపాధ్యాయ పోస్టులతో పాటు జూనియర్‌ అసిస్టెంట్‌, నాలుగో తరగతి ఉద్యోగులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, డీటీపీ ఆపరేటర్లు, టైపిస్టు తదితర పోస్టులన్నీ జిల్లా స్థాయిలోనే భర్తీ చేస్తారు. ఈ పోస్టు ల్లో 95 శాతం ఆయా జిల్లా వాసులకే ఉద్యోగాలు దక్కనున్నాయి. వీటితో పాటు జోనల్‌ స్థాయిలోనూ భారీగా ఖాళీలు ఉన్నాయి. జోనల్‌ పోస్టులు గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, డాక్టర్లు, వ్యవసా య శాఖ అధికారులు, తహసీల్దార్లు తదితర పోస్టులు జోనల్‌ స్థాయిలోకి రానున్నాయి. కాళేశ్వరం జోన్‌లో 1,630 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాళేశ్వరం జోన్‌లో భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు మంచిర్యాల, పెద్దపల్లి, కుమ్రంభీ ఆసిఫాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. ఐదు జిల్లాలు కూడా గోదావరి తీరంలో ఉన్నవే. దీం తోపాటు ఇవి ఏజెన్సీ, కోల్‌బెల్ట్‌ ప్రాంతాలే. ఈ నేప థ్యంలో కష్టపడితే జాబ్‌ను ఈజీగా పొందే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇతర జోన్లతో పోలి స్తే కాళేశ్వరం జోన్‌లో పెద్దగా కాంపిటేషన్‌ ఉండ కపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. వీటితో పాటు మల్టీ జోన్‌లోనూ 6,800 పోస్టులు ఉన్నాయి. మొత్తం గా రెండు జిల్లాల నిరుద్యోగులకు 10,044 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

తొలిసారిగా గ్రూపు-1   

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా గ్రూపు-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వ సిద్ధమైంది. దీంతో ఏళ్లతరబ డి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఊరట కలిగింది. ప్రభుత్వ ప్రకటనతో మళ్లీ పుస్తకాలను తిరిగేసే పనిలో పడ్డారు. గ్రూపు-1లో సెలెక్ట్‌ అయితే డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, కమర్షయల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, జిల్లా పంచాయ తీ అధికారి, జిల్లా రిజిస్ట్రార్లు, డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, జిల్లా ఉపాధి అధికారి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి, మునిసిపల్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ట్రెజరీ అధికారి, ఎంపీడీవో లు, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌, ఆర్టీవో తదితర ఉద్యోగాలు సాధించొచ్చు.  

వయసు సడలింపుపై..

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్ల కాలంలో తొలిసారిగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫి కేషన్లు ఇవ్వబోతుండటంతో నిరుద్యోగుల్లో ఆనందంతో పాటు ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఉద్యోగాల కోసం వయసు సడలింపు ఇవ్వడంపై భిన్నాభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. గతంలో జనరల్‌ అభ్యర్థులకు 34ఏళ్ల వరకే వయో పరిమితి ఉండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 44 ఏళ్లకు ఉండేది. ఈ వయో పరిమితిని జనరల్‌ అభ్యర్థులకు కొనసాగిస్తూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మాత్రం 49 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. దివ్యాంగులకు ఏకంగా 54 ఏళ్ల వరకు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు సడలింపు ప్రకటించింది. స్వరాష్ట్రంలో ఉద్యోగాలు లేక చాలా మంది వయసు దాటిపోయిందని,  ఈ నేపథ్యంలో సడలింపు చేయడం సబబే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  వయసు సడలింపు వల్ల పెద్దగా ప్రయోజనం లేదని, నేటి జనరేషన్‌తో పోటీ పడి ఉద్యోగాలు సాధించటం కష్టమే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


Updated Date - 2022-03-10T05:46:22+05:30 IST