నొవాక్‌@ 80

ABN , First Publish Date - 2022-06-28T09:36:01+05:30 IST

డిఫెడింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ రెండోరౌండ్‌లో ప్రవేశిం చాడు.

నొవాక్‌@ 80

జొకోవిచ్‌ శుభారంభం

హుర్కాజ్‌కు షాక్‌

రెండోరౌండ్‌కు రదుకాను, కొంటవీట్‌, జెబ్యూర్‌

లండన్‌: డిఫెడింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ రెండోరౌండ్‌లో ప్రవేశిం చాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ కొంటవీట్‌, మూడో సీడ్‌ జెబ్యూర్‌, లోకల్‌ స్టార్‌, 10వ సీడ్‌ రదుకాను కూడా శుభారంభం చేశారు. అయితే పురుషుల ఏడోసీడ్‌ హ్యూబర్ట్‌ హుర్కాజ్‌కు ఆరంభ పోరులోనే షాక్‌ తగిలింది. హాట్‌ఫేవరెట్‌ జొకోకు కొరియా ఆటగాడు క్వాన్‌ సూన్‌ గట్టి పోటీ ఇచ్చాడు. దాంతో నొవాక్‌ తొలి రౌండ్‌ నాలుగు సెట్లపాటు కొనసాగింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో సెర్బియా స్టార్‌ 6-3, 3-6, 6-3, 6-4 స్కోరుతో అన్‌సీడెడ్‌ సూన్‌ను చిత్తు చేసి ముందంజ వేశాడు.


ఈ విజయం వింబుల్డన్‌లో జొకోకు 80వది కావడం విశేషం. దాంతో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలో అత్యధిక మ్యాచ్‌లలో గెలుపొందిన ఆటగాడిగా నొవాక్‌ చరిత్ర సృష్టించాడు. ఇక, నిరుటి సెమీఫైనలిస్ట్‌ హుర్కాజ్‌ (పోలెండ్‌) ఐదు సెట్ల సమరంలో 6-7 (4), 4-6, 7-5, 6-2, 6-7 (8)తో అన్‌సీడెడ్‌ డవిడోవిచ్‌ (స్పెయిన్‌) చేతిలో మట్టికరిచాడు. మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో కొంటవీట్‌ (ఎస్టోనియా) 7-5, 6-1తో బెర్నార్డా పెరా (క్రొవేషియా)పై, యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఎమ్మా రదుకాను 6-4, 6-4తో అలీసన్‌ (బెల్జియం)పై, ట్యునీసియాకు చెందిన జెబ్యూర్‌ 6-1, 6-3తో మిర్జమ్‌ యోర్క్‌లుండ్‌ (స్వీడన్‌)పై గెలిచి రెండో రౌండ్‌ చేరారు. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనలిస్ట్‌ కాస్పెర్‌ రడ్‌ (నార్వే) 7-6 (1), 7-6 (9), 6-2తో ఆల్బర్ట్‌ రామోస్‌ (స్పెయిన్‌)పై, తొమ్మిదో సీడ్‌ నోరి (బ్రిటన్‌) 6-0, 7-6 (3), 6-3తో అండుజార్‌ (స్పెయిన్‌)పై విజయంతో రెండో రౌండ్‌లో ప్రవేశించారు. 



Updated Date - 2022-06-28T09:36:01+05:30 IST